Infinix hot 70 Pro 5G : నేటి సాంకేతిక కాలంలో ఫోన్ కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. అన్ని పనులు ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. అందువల్లే తయారీ సంస్థలు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా infinix అనే కంపెనీ hot 70 pro 5G అనే మోడల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
సెప్టెంబర్ 4న ఈ ఫోన్ మనదేశంలో అఫీషియల్ గా విడుదలైంది ఈ ఫోన్ లో 6000 mAh బ్యాటరీ ఉంది. 144 హెచ్ జడ్ రీ ఫ్రెష్ రేట్, డిస్ ప్లే.. వెనుక భాగంలో నోటిఫికేషన్ల కోసం ప్రత్యేకమైన యాక్టివ్ మాట్రిక్స్ క్యూబ్ (active Matrix cube) లైటింగ్ ఫీచర్ ఇందులో అందుబాటులో ఉంది.
ముఖ్యమైన స్పెసిఫికేషన్లు
డిస్ ప్లే: 6.76 ఇంచుల FHD+ LCD స్క్రీన్, 144 హెచ్ జడ్ రీ ఫ్రెష్ రేట్.
ప్రాసెసర్: మీడియా టెక్ డైమన్ సిటీ 7100 5G (mediatech diamensity 7100)
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16.
Back camera: 50 megapixel primary camera (Sony IMX 882 sensor)
Front camera: 8 megapixel selfie camera
బ్యాటరీ, చార్జింగ్: 6 000 mAh బ్యాటరీ, 45 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ప్రొటెక్షన్: దుమ్ము, ధూళి, నీటి నుంచి నిరోధకత కోసం ఐపీ 68 రేటింగ్.
ప్రత్యేకత.. ఈ ఫోన్ వెనక ఉండే ప్యానల్ మీద యాక్టివ్ మాట్రిక్స్ క్యూబ్.. ఇన్కమింగ్ కాల్స్.. సందేశాలు.. చార్జింగ్ సమయాల్లో లైటింగ్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. థర్మో ఆరెంజ్ వేరియంట్ టెంపరేచర్ ను బట్టి మిరాజ్ గ్రీన్ వేరియంట్ యు వి లైట్ ను బట్టి రంగులు మారుతుంది.
మనదేశంలో దీని ధర 6 జీబీ + రామ్ + 128 జీబీ స్టోరేజ్..22,999 కు లభిస్తుంది.
8 జీబీ రామ్+ 128 జీబీ స్టోరేజ్ 27,999 ధరలో లభిస్తుంది .
ఈ ఫోన్ తొలి సెప్టెంబర్ 7 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్.. ఇన్ఫినిక్స్ అధికారిక వెబ్సైట్ల నుంచి మొదలవుతుంది. ఇది స్కిల్ గ్లో పర్పుల్.. డైవ్ బ్లూ.. థర్మో ఆరెంజ్.. మిరాజ్ గ్రీన్ కలర్ లో లభిస్తుంది.