Homeఆంధ్రప్రదేశ్‌AP Government Investment Issues: ఏపీలో 'ప్రతిపక్షం' పారిశ్రామిక ప్రగతి!

AP Government Investment Issues: ఏపీలో ‘ప్రతిపక్షం’ పారిశ్రామిక ప్రగతి!

AP Government Investment Issues: ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షానికి కూడా చాలా బాధ్యతలు ఉంటాయి. ప్రభుత్వాలు సుపరిపాలనతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో దృష్టి సారిస్తాయి. అయితే ఆ పని ప్రతిపక్షం కూడా చేయవచ్చు. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. తెస్తున్న పరిశ్రమలతో పాటు పెట్టుబడులపై బురద జల్లుతున్నారు. ఏకంగా పెట్టుబడులు పెడుతున్న వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా. ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు శాసనసభ సమావేశాలకి రానప్పుడు.. రాష్ట్రానికి పరిశ్రమలు, […]

AP Government Investment Issues: ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షానికి కూడా చాలా బాధ్యతలు ఉంటాయి. ప్రభుత్వాలు సుపరిపాలనతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో దృష్టి సారిస్తాయి. అయితే ఆ పని ప్రతిపక్షం కూడా చేయవచ్చు. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. తెస్తున్న పరిశ్రమలతో పాటు పెట్టుబడులపై బురద జల్లుతున్నారు. ఏకంగా పెట్టుబడులు పెడుతున్న వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా. ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు శాసనసభ సమావేశాలకి రానప్పుడు.. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ కంపెనీలు తెస్తారని ఆశించడం దురాశ అవుతుంది. తేలేరు సరి కదా.. తెస్తున్న వాటికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. భయాందోళనకు గురిచేస్తున్నారు.

Also Read: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు..అందరూ గురువిందలే

* పరిశ్రమల గతి ఏంటో..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. పరిశ్రమలు తరలివస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమల కథలు విని విని చెవులకు చిల్లు పడిపోయాయి. ఇప్పటికీ కూడా అదే కథలు వినిపిస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు( CM Chandrababu). అప్పట్లో అమరావతి భూములను సమీకరించి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అయితే వాటిని గ్రాఫిక్స్ తో పోల్చిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖ రాజధాని అంటూ కొత్త నినాదాన్ని అందుకుంది. అయితే విశాఖపై వైసిపికి ఉన్న ప్రేమను ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే దారుణాతి దారుణంగా ఓడించారు.

* రాజధాని అన్నారు ఇప్పుడు.. విశాఖ( Visakhapatnam) ఆర్థిక నగరంగా అభివృద్ధి చెందుతోంది. అక్కడ రాజధాని పెడితే తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ సమర్ధించుకుంది. కానీ ఇప్పుడు అదే విశాఖకు ప్రతిష్టాత్మక గూగుల్ డేటా కంపెనీ వస్తే ఎందుకు మోకాలు అడ్డుతోంది? ఎందుకు తమ పార్టీకి చెందిన ఎంపీ తో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించింది. ఐటీ కంపెనీల కోసం రాష్ట్రాలు పోటీ పడుతుంటే.. ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఓ కంపెనీని అడ్డుకునేందుకు ఒక రాష్ట్ర ప్రతిపక్షం ప్రయత్నం చేయడం ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం. వెళ్లారు అక్కడ న్యాయమూర్తిని ఆశ్రయించారు. స్పష్టంగా రాజకీయ దురుద్దేశం కనిపిస్తుండడంతో కోర్టులో న్యాయమూర్తి చీవాట్లు పెట్టి వేసిన పిటిషన్ ను కొట్టివేశారు. మొట్టికాయలు వేయించుకొని బాధపడడం, నవ్వుల పాలు అవడం అవసరమా.

* ప్రతిష్టాత్మక ప్రాజెక్టు..
గూగుల్ డేటా సెంటర్( Google data centre) అనేది ఆసియాలోనే అతి పెద్దది. అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ. కూటమి ప్రభుత్వం దానికి రాయితీలు ఇచ్చింది. సాధారణంగా అవి తప్పుగా కనిపిస్తాయి. ఒక అంతర్జాతీయ కంపెనీని రప్పిస్తే దానికి అనుబంధంగా చాలా కంపెనీలు వస్తాయి. ఇప్పుడు ఇచ్చిన రాయితీలు వాటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే గూగుల్ డేటా సెంటర్ అనేది ఐటీ కంపెనీలకు ఒక ఎర. గతంలో ఐటీ కంపెనీలు బాగా అభివృద్ధి చెందిన బెంగళూరు, హైదరాబాదులో జరిగింది ఇదే. ఒకసారి అధికారంలోకి వస్తేనే 30 ఏళ్ల పాటు పాతుకు పోతామని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చేవారు. అటువంటిది ఒక గూగుల్ డేటా కంపెనీ వల్ల దీర్ఘకాలంలో కలిగే ప్రయోజనాలు మాత్రం ఆ పార్టీ గుర్తించకపోవడం శోచనీయం. ఏపీ ప్రజల దురదృష్టకరం. విశాఖలో పెట్టుబడులను ఇదే మాదిరిగా వ్యతిరేకిస్తే మాత్రం విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్రవాసులు వైసీపీని బంగాళాఖాతంలో కలపడం ఖాయం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper