Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy Mavigan: మావిగన్ క్రెడిట్ మొత్తాన్ని జగన్ కు ఇచ్చిన...

YS Jagan Mohan Reddy Mavigan: మావిగన్ క్రెడిట్ మొత్తాన్ని జగన్ కు ఇచ్చిన సజ్జల

YS Jagan Mohan Reddy Mavigan: జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )కొత్త రాజధాని ప్రతిపాదనపై ఇప్పుడు తెగ చర్చ నడుస్తోంది. మావిగన్ అనే పేరును ఆయన రాజధానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. మచిలీపట్నంలో MA తీసుకోండి.. విజయవాడలో VI తీసుకోండి.. గుంటూరులో GUN తీసుకోండి. మావిగన్ అని పేరు పెట్టుకోండి అంటూ జగన్మోహన్ రెడ్డి సూచించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ ఈ ప్రతిపాదన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిపోయింది. అదో వింత పేరుతో పాటు విచిత్రమైన ఐడియా ఉండడంతో.. జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చిన ఆ మేధావి ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. సహజంగానే ఇటువంటి వాటికి స్క్రిప్టులు రాస్తుంటారు సజ్జల రామకృష్ణారెడ్డి. దీంతో అందరి చూపు ఆయన పైనే పడింది. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల విశ్లేషకులు సైతం సజ్జల వైపు అనుమానపు చూపులు చూశారు. దీంతో ఆయన మీడియా ముందుకు వచ్చి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

* కాస్త ఆందోళన గానే..
మీడియా సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి( sajjala Ramakrishna Reddy ) కాస్త ఆందోళనతోనే కనిపించారు. మావిగన్ ఐడియా నాది కాదు బాబోయ్ అంటూ తేల్చి చెప్పారు. విలేకరులు అదే పనిగా మావిగన్ పేరు ప్రస్తావిస్తుంటే తనకు తెలియదన్నట్టు దాని జోలికి పోలేదు. మరోవైపు జగన్ గారు ఎవరి సలహాలు అయినా తీసుకుంటారా? ఆయనకు ఎవరైనా ఉచిత సలహాలు ఇవ్వగలరా అంటూ బదులిచ్చారు. జగన్మోహన్ రెడ్డి తనంతట తానుగా తీసుకున్న బ్రహ్మాండమైన నిర్ణయం గా సమర్ధించుకున్నారు. అందులో తనకు క్రెడిట్ ఉండేలా ఇష్టపడలేదు సజ్జల వారు. సున్నితంగా ఈ అంశం నుంచి పక్కకు తప్పుకున్నట్టు అనిపించింది సజ్జల వ్యవహార శైలి.

* మొన్ననే చీవాట్లు అమరావతిలో( Amravati capital ) మొన్న మధ్యన ఒక కాంక్లేవ్ లో పాల్గొన్నారు సజ్జల. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే జగన్మోహన్ రెడ్డి పాలన ఉంటుందని చెప్పుకొచ్చారు. దానిపై జగన్ క్లాస్ పీకినట్లు కూడా ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు ఈ మావిగన్ గోల తన మెడకు చుట్టుకుంటుందన్న భయం ఆయనలో కనిపించింది. అందుకే జగన్మోహన్ రెడ్డిని ఒక తిరుగులేని నాయకుడిగా చూపిస్తూనే.. మావికం సలహాదారు బాధ్యత నుంచి తన పేరును రక్షించుకోవడానికి సకల ప్రయత్నాలు చేశారు సజ్జల వారు. అమరావతికి అడ్డుకట్ట వేయడానికి తెచ్చిన ఈ మావిగన్ ఐడియా ఇప్పుడు వైసీపీలో చిచ్చు రేపుతోంది. ఈ పేరుతో సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. అందుకే క్రెడిట్ ఆరాటపడడం లేదు వైయస్సార్సీపి నేతలు. ఆ క్రెడిట్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper