Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Minister Rankings: మంత్రులకు ర్యాంకింగ్స్.. వెనుక బాటులో ఆమె

Andhra Pradesh Minister Rankings: మంత్రులకు ర్యాంకింగ్స్.. వెనుక బాటులో ఆమె

Andhra Pradesh Minister Rankings: ఏపీలో ( Andhra Pradesh)టీడీపీ కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. ప్రతి 15 రోజులకు మంత్రి మండలి సమావేశం. ప్రతి నెల రోజులకు ఒకసారి కలెక్టర్ల రివ్యూ కొనసాగుతూ వస్తోంది. అదే సమయంలో మంత్రులకు ర్యాంకింగ్, వారి పనితీరు మదింపు వంటి విషయంలో సీఎం చంద్రబాబు ముందు ఉంటున్నారు. వారికి ర్యాంకింగ్స్ ఇస్తున్నారు. తాజాగా కలెక్టర్ల రివ్యూలు మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారు చంద్రబాబు. ఈ ర్యాంకింగ్స్ లో మంత్రి కింజరాపు అచ్చెనాయుడు తొలి స్థానంలో నిలిచారు. మంత్రి వంగలపూడి అనిత చివరి స్థానంలో ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాలుగో స్థానంలో నిలిచారు. మంత్రుల శాఖలకు సంబంధించి ఫైళ్ళ క్లియరెన్స్ విషయంలో ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. మంత్రుల శాఖల ప్రగతిలో ఈ ఫైల్ క్లియరెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే సీఎం చంద్రబాబు దీనిపైనే స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.

Also Read: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు..అందరూ గురువిందలే

* మంత్రుల పనితీరుపై మదింపు.. అమరావతిలో( Amravati ) కలెక్టర్ల సమావేశం తొలి రోజున మంత్రుల పనితీరుపై హాట్ కామెంట్స్ చేశారు సీఎం చంద్రబాబు. ఆయా శాఖల్లో ఫైళ్ళ క్లియరెన్స్ ఎంత వేగంగా జరుగుతుందని అంశంపై మిత్రులందరికీ రేటింగ్స్ ప్రకటించారు. తొలి స్థానంలో కింజరాపు అచ్చెనాయుడు నిలిచారు. ఆ తరువాత స్థానాల్లో వరుసగా నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాలుగు స్థానంలో నిలిచారు. మంత్రి వంగలపూడి అనిత చివరి స్థానంలో నిలిచారు. మంత్రులు తమ ఫైళ్లను క్లియర్ చేసేందుకు ఎంత సమయం తీసుకుంటున్నారో చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు, తీసుకున్న నిర్ణయాలు వేగంగా పూర్తి అయ్యేలా త్వరగా ఫైళ్లను క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు. పాలనలో వేగం పెంచడం ద్వారా.. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వెల్లడించారు.

* ప్రతి నెలా కలెక్టర్ల రివ్యూ
ప్రతి నెల రోజులకు ఒకసారి కలెక్టర్ల సమావేశం జరపడం ఆనవాయితీగా పెట్టుకున్నారు సీఎం చంద్రబాబు( CM Chandrababu). అందులో భాగంగా నిన్ననే అమరావతిలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈరోజు కూడా అది కొనసాగనుంది. కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖ పై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. శాఖల ఆదాయంపై కూడా సమీక్షిస్తారు. రాష్ట్ర విద్యారంగం తో పాటు ఉపాధి అవకాశాలపై కూడా చర్చించనున్నారు ఈరోజు సమావేశంలో. కోర్టులో ఉన్న కేసులు, న్యాయశాఖ పరిధిలో ఉన్న అంశాల పైన అధికారులు సీఎంకు వివరాలు అందించనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించి కీలక నిర్ణయం కూడా ఈరోజు తీసుకోనున్నారు. తొలిరోజు మంత్రులకు ర్యాంకింగ్స్ ఇవ్వగా.. ఈరోజు అధికారులకు ర్యాంకింగ్స్ ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular