Star Actors Children Distance: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. డిఫరెంట్ సినిమాలను చేస్తు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఇలాంటి క్రమంలోనే వాళ్ల ఫ్యామిలీ విషయంలో మాత్రం ఫెయిల్ అయిపోతున్నారు. కారణమేమిటి అంటే వాళ్ల పిల్లల్ని వాళ్ళు ఎక్కువగా పట్టించుకోకపోవడం దానివల్ల వాళ్లకు వాళ్ళ పిల్లలకు మధ్య డిస్టెన్స్ అయితే పెరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే తమిళ్ స్టార్ హీరో అయిన విజయ్ సైతం ప్రస్తుతం తన కొడుకు విషయంలో పెద్దగా కేర్ తీసుకోవడం లేదు. అందువల్ల తన కొడుకు సైతం ఎక్కువగా పట్టించుకోవడం లేదంటూ వార్తలైతే వస్తున్నాయి. రీసెంట్ గా విజయ్ భార్య సంగీత విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కింది.
Also Read: ‘ఎత్తరా ఎత్తరా’ పాటలో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ పై అభిమానుల అసంతృప్తి.. ట్వీట్లు చూస్తే ఆశ్చర్యపోతారు!
విజయ్ కొడుకు తన తల్లి వైపు ఉన్నాడు. కానీ తన తండ్రి అయిన విజయ్ వైపైతే ఉండడం లేదు. కారణం ఏంటి అంటే విజయ్ తన పిల్లలకి కావాల్సిన టైం ఇవ్వడం లేదు, వాళ్లతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నాడట. అలాగే విజయ్ వైఖరి కూడా తన పిల్లలకి నచ్చకపోవడం వల్లే వాళ్ళు తన నుంచి దూరం అవుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా ఎంత బిజీగా ఉన్నా ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇంట్లో పిల్లల్ని పట్టించుకోవాలి వాళ్ల మీద కేర్ కూడా తీసుకోవాలంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఒక కమల్ హాసన్ సైతం గతంలో తన కూతుర్లు అయిన శృతిహాసన్ అక్షర హాసన్ లను పెద్దగా పట్టించుకునే వాడు కాదంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి.
కానీ వాళ్లు మాత్రం వాళ్ళ నాన్న విషయంలో కానీ అమ్మ విషయంలో కానీ చాలా జాగ్రత్తలైతే తీసుకుంటూ వస్తున్నారట. ఇలా సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కన్న తర్వాత విడాకులు తీసుకోవడం విడిపోవడం వల్ల పిల్లలు స్టార్ హీరోలకి దూరమవుతున్నారు. వాళ్ళ మధ్య బాండింగ్ అనేది కూడా అంత బాగుండటం లేదంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…