Homeఆంధ్రప్రదేశ్‌Government Employees:ఉద్యోగం అంటే ఏపీలోనే చేయాలి.. అట్లుంటది మరి చంద్రబాబుతోని..

Government Employees:ఉద్యోగం అంటే ఏపీలోనే చేయాలి.. అట్లుంటది మరి చంద్రబాబుతోని..

Government Employees: ఒక ప్రభుత్వం సజావుగా నడవాలి అంటే దానికి ఉద్యోగుల తోడ్పాటు చాలా అవసరం. ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు.. సంక్షేమ పథకాలు వట్టి వాటిని అమలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగులు ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య సారధి లాంటివాళ్ళు. వారిని సక్రమంగా చూసుకుంటే ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు. ప్రజలకు కూడా మెరుగైన పరిపాలన అందుతుంది. ఇదే సూత్రాన్ని గతంలో అమలు చేశారు. ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారు. రాష్ట్ర […]

Government Employees: ఒక ప్రభుత్వం సజావుగా నడవాలి అంటే దానికి ఉద్యోగుల తోడ్పాటు చాలా అవసరం. ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు.. సంక్షేమ పథకాలు వట్టి వాటిని అమలు చేయడానికి ఆస్కారం ఉంటుంది.

ఉద్యోగులు ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య సారధి లాంటివాళ్ళు. వారిని సక్రమంగా చూసుకుంటే ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు. ప్రజలకు కూడా మెరుగైన పరిపాలన అందుతుంది. ఇదే సూత్రాన్ని గతంలో అమలు చేశారు. ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినప్పటికీ.. ఇచ్చిన హామీలు అమలు చేసిన బాధ్యత భుజం మీద ఉన్నప్పటికీ.. చంద్రబాబు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణాన్ని.. ఆశాజనకానికంటే ఎక్కువ స్థాయిలో ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు. గతంలో మద్యం దుకాణాల వద్ద ఉద్యోగులు పనిచేసేవారు. టీచర్లను కూడా గత ప్రభుత్వం ఆ విధులకు ఉపయోగించుకుంది. అటువంటి స్థాయి నుంచి ఉద్యోగులను గౌరవప్రదమైన స్థితికి తీసుకొచ్చారు చంద్రబాబు . వారికి చెల్లించే వేతనాల విషయంలో కూడా మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ దక్కే విధంగా చూస్తున్నారు.

తాజాగా ఉద్యోగులపై చంద్రబాబు వరాలు కురిపించారు. రెండు డీఎలకు.. సెలవులకు ఓకే చెప్పేశారు. గత ప్రభుత్వం అనేక అంశాలను పెండింగ్లో పెడితే.. వాటిని అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం ఉద్యోగుల్లో హర్షానికి కారణం అవుతోంది. అంతేకాదు పిఆర్సికి కమిషనర్ నియామకానికి చంద్రబాబుకి చెప్పారు. సంక్రాంతి నాటికి సరెండర్ లీవ్ జమ చేస్తామని పేర్కొన్నారు. కానీ, పోలీసులకు మరొకటి అందంగా ఇస్తామని వివరించారు. అంతేకాదు నాటి కాలంలో రద్దుచేసిన ఆదనపు క్వాంటం పెన్షన్ పునరుద్ధరణకు ఓకే చెప్పారు. ఈ హెచ్ ఎస్ వాటాలు.. వైద్య సేవ ట్రస్ట్ కు ఇస్తున్నటు ప్రకటించారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడం ఉద్యోగులలో ఆనందాన్ని నింపుతోంది. ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వం మీద ప్రతి ఏడాది 2880 కోట్ల భారం పడుతుంది. అంతేకాదు 12వ పిఆర్సి కమిషనర్ నియామకానికి చంద్రబాబు ఓకే చెప్పడం కూటమి ప్రభుత్వ దార్శనికతకు అద్దం పడుతుంది.

2024 జూలై 1.. 2025 జనవరి కి సంబంధించిన రెండు డీఏలను కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది. 2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ సెలవులను వచ్చే సంక్రాంతి కి ఉద్యోగుల ఖాతాల్లో ప్రభుత్వం వేయనుంది. అంతేకాదు జగన్ ప్రభుత్వం నాడు రద్దుచేసిన పెన్షనర్ల అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ ను వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రభుత్వం ఇవ్వనుంది. 70 సంవత్సరాలు దాటిన వారికి 10 శాతం.. 75 సంవత్సరాలు దాటిన వారికి పదిహేను శాతం వర్తించనుంది.

ఉద్యోగుల విషయంలో చంద్రబాబు సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల దేశవ్యాప్తంగా చేర్చ జరుగుతుంది. ఇతర రాష్ట్రాలలో పనిచేస్తున్న ఉద్యోగాలు ఏపీ లభిస్తున్న ప్రయోజనాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఉద్యోగం చేయాలంటే ఏపీలోనే చేయాలి అన్నట్టుగా చంద్రబాబు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper