Ladakh Electricity Project:మనిషికి బలంగా అనుకుంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది. ప్రతికూల పరిస్థితి కూడా చిన్నబోతుంది. ఎముకలు కొరికే చలి.. కనుచూపుమేర మంచుకొండలు.. అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టం.. ఇలాంటి చోట కొంతమందికి పనే దైవం. విధి నిర్వహణే వారికి శిరోధార్యం ఇలాంటి ఇబ్బందుల్లో కూడా వారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రజల ఇబ్బందులతో పోల్చితే.. ఇవి ఒక ఇబ్బందులా అని వారు అనుకున్నారు.. అంతేకాదు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రాణాల సైతం లెక్క చేయలేదు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది.
మైనస్ పది డిగ్రీలలో
జమ్ము కాశ్మీర్లోని లద్ధాక్ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యాలను మరింత పెంపొందించేందుకు కార్మికులు కృషి చేస్తున్నారు. వారు చేస్తున్న పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు కూడా విద్యుత్ సదుపాయం కల్పించాలని లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం అడుగులు వేస్తోంది ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్టుగా సిబ్బంది అత్యంత కఠినమైన వాతావరణంలో పని చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలకు పడిపోయినప్పటికీ పనులు ఏమాత్రం ఆపడం లేదు.
ప్రాణాలను ఫణంగా పెట్టి
వందల అడుగుల ఎత్తులో విద్యుత్ స్తంభాలు.. లైన్లకు సంబంధించిన పనులు చేస్తున్నారు. చుట్టూ మంచుకొండలు.. కింద లోతైన లోయలు.. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే ప్రమాదం జరిగే పరిస్థితులు.. అయినప్పటికీ కార్మికులు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పనులు చేస్తున్నారు.
గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు
లద్ధాక్ ప్రాంతంలోని నుబ్రా ర్యాలీ.. సియాచిన్ గ్లేషియర్ వంటి ప్రాంతాలలో పనులు జరుగుతున్నాయి. సాధారణ సమయంలో విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేయడమే చాలా శ్రమతో కూడుకుంటుంది. అలాంటిది మంచు ప్రాంతాలలో.. అత్యంత ఎత్తైన ప్రదేశాలలో విద్యుత్ సదుపాయం కల్పించడం అంటే మామూలు ఇబ్బంది కాదు. అక్కడి వాతావరణం ఇప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. తీవ్రమైన చలి.. బలమైన గాలులు.. మంచు వల్ల పనులకు నిత్యం ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ నిర్ణయించిన గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సిబ్బంది పనిచేస్తున్నారు.
హాట్సాఫ్ చెప్పాల్సిందే
ఈ పనులకు సంబంధించిన వీడియోలు బయటికి వచ్చాయి. దీంతో చాలామంది కార్మికుల శ్రమను కొనియాడుతున్నారు. ప్రశంసలు కురిపిస్తున్నారు. మన ఇంట్లో వెచ్చగా ఉంటూ.. విద్యుత్ కాంతుల మధ్య జీవితాన్ని కొనసాగిస్తున్నామంటే.. దాని వెనుక ఇటువంటి కార్మికుల శ్రమ ఉంటుందని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. మైనస్ పది డిగ్రీల చలిలో.. వందల అడుగుల ఎత్తులో వారు చేస్తున్న ఈ సాహసానికి నిజంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే.
POWERGRID Heroes Brave Blizzard to Restore Electricity Across Ladakh!
लद्दाख : बर्फबारी में भी खंभों पर चढ़कर काम करते नजर आए बिजलीकर्मी ! https://t.co/Piys33eZrG
— Channel1 (@Channel1india) November 1, 2026