January 12 Vidudala:విక్టరీ వెంకటేష్.. నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం జనవరి 12 విడుదల. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం కజకిస్తాన్ లో జరుగుతోంది.. ఈ షెడ్యూల్లో ఇద్దరు హీరోల మీద భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
స్టంట్ మాస్టర్ రియల్ సతీష్ పర్యవేక్షణలో పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ రూపొందించారు. దీంతోపాటు వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కలిసి పాల్గొని ఒక ప్రత్యేకమైన పాటను కూడా చిత్రీకరించబోతున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్టెప్పులు అందిస్తున్నారు. కజకిస్తాన్ ప్రాంతంలో అందమైన లొకేషన్ లలో ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇది ఈ సినిమాకు విసువల్ గా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ సినిమాలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్.. కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్.. కామెడీ, యాక్షన్ అంశాలతో అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి బావబామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్ లైన్ కూడా రూపొందించారు. ఇది సినిమా మీద ఆసక్తిని పెంచుతుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతిని లక్ష్యంగా చేసుకొని ఈ సినిమాను జనవరి 12 2027న విడుదల చేయాలని నిర్మాతలు నిర్మించుకున్నారు.
అనిల్ రావిపూడి కి సంక్రాంతి సీజన్ ఒక సెంటిమెంట్ లాంటిది.. గతంలో ఎఫ్2, సంక్రాంతి వస్తున్నాం, మన శివశంకర్ వరప్రసాద్ గారు పండక్కి వచ్చేస్తున్నారు.. వంటి సినిమాలు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చాయి. ఇవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన విజయాలను అందుకున్నాయి. ఇంటిల్లిపాది చూసే విధంగా ఈ చిత్రాలను అనిల్ రావిపూడి చిత్రీకరించారు. ఇప్పుడు జనవరి 12న విడుదల అనే చిత్రం ద్వారా మరోసారి సంక్రాంతి బరిలోకి అనిల్ సిద్ధమయ్యారు. విక్టరీ వెంకటేష్ తో అనిల్ గతంలోనే ఎఫ్2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం, మన శివశంకర వరప్రసాద్ గారు వంటి సినిమాలను తీశారు. ఇది వెంకటేష్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి కి ఐదవ సినిమా. నందమూరి కళ్యాణ్ రామ్ గతంలో పటాస్ అనే సినిమాను తీశారు. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విషయాన్ని అందుకుంది. నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో అటు నందమూరి కళ్యాణ్ రామ్.. ఇటు విక్టరీ వెంకటేష్ తో అనిల్ రావిపూడి ఎలాంటి కామెడీ పండిస్తారు.. ఎలాంటి సినిమా రూపొందిస్తారు.. అనే అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి.
THE ACTION IS GETTING BIGGER IN KAZAKHSTAN
The shoot of #January12Vidudala is in full swing, with Victory @VenkyMama & @NANDAMURIKALYAN shooting a power-packed action sequence and a spectacular song
Just wait for a FULL-ON ENTERTAINMENT FEAST this Sankranthi, arriving in theatres on JANUARY 12, 2027 ❤️
@AnilRavipudi @KeerthyOfficial @IamKrithiShetty @gvprakash @sahugarapati7 @YoursSKrishna @Shine_Screens @ZeeStudios_ @SureshProdns @zeestudiossouth @zeemusicsouth #NileshDeorah @girishjohar #AmeetBhuvan @IamDivyaVijay @HaashtagMedia @UrsVamsiShekar
— Shine Screens (@Shine_Screens) November 5, 2026