Tollywood Heroines: మన తెలుగు ఆడియన్స్ ఎంతో గొప్ప వాళ్ళు.. ముఖ్యంగా టాలెంట్ ఉన్న ఆర్టిస్టులను ప్రోత్సహించడం లో ఎప్పుడూ ముందు ఉంటారు. ఎంతో మంది బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఇండస్ట్రీ లో ఉన్నారు , వారి వారసులు కూడా ఎంట్రీ ఇచ్చారు. కానీ మన ఆడియన్స్ టాలెంట్ ఉన్న వాళ్ళను మాత్రమే ప్రోత్సహించారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళను కూడా ఆదరించారు. ఇతర భాషల్లో లాగా కాకుండా, మన టాలీవుడ్ లో కంటెంట్ ఉంటే పరభాషా చిత్రాలను నెత్తిన పెట్టుకొని ఆదరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఇండస్ట్రీ ని ఇతర భాషలకు సంబంధించిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కూడా అమితంగా గౌరవిస్తున్న ఈరోజుల్లో , మన సినిమాల ద్వారా పేరు తెచ్చుకొని , బాలీవుడ్ కి వెళ్ళిపోయి , మన టాలీవుడ్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు కొంతమంది హీరోయిన్స్. వాళ్ళని చూస్తే నెటిజెన్స్ కి రక్తం మరిగిపోతుంది.
రీసెంట్ గా రాధికా ఆప్టే మన టాలీవుడ్ పై చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో సంచలనం రేపుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మేల్ డామినేషన్ ఎక్కువ, హీరోయిన్స్ కి ప్రాధాన్యత లేదు అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఈమెకు అర్థం కానిది ఏమిటంటే, ఇక్కడ అనుష్క , సమంత వంటి హీరోయిన్స్ హీరోలతో సమానమైన ఇమేజ్ ని సంపాదించుకున్నారు అనేది. వీళ్ళు ప్రధాన పాత్రలు పోషించిన సినిమాలు స్టార్ హీరోలతో సమానమైన వసూళ్లను రాబట్టాయి. రీసెంట్ గా సాయి పల్లవి , రష్మిక మందాన, శ్రీలీల వంటి వారు కూడా పెద్ద స్థాయికి వెళ్లారు. టాలెంట్ ఉంటే హీరోలను సైతం డామినేట్ చేసే స్థాయికి నేడు మన ఇండస్ట్రీ లో హీరోయిన్స్ ఎదిగారు. ఇది రాధికా ఆప్టే గమనించకపోవడం దురదృష్టకరం.
ఇక పూజా హెగ్డే అయితే సౌత్ ఇండస్ట్రీ లో మేకర్స్ హీరోయిన్స్ ని కేవలం అందాల ఆరబోతకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు అంటూ కామెంట్ చేసింది. ఈమెని ఆదరించిన ఏకైక ఇండస్ట్రీ టాలీవుడ్ మాత్రమే. బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఈమె చేస్తున్నది కూడా అందాల ఆరబోతనే. కెరీర్ మొత్తం మీద నటన పరంగా ఈమె నిరూపించుకున్న సినిమా ఒక్కటి కూడా లేదు , అయినప్పటికీ మన టాలీవుడ్ పై లూజ్ కామెంట్స్ చేస్తాది. ఇక నాయక్ హీరోయిన్ అమలా పాల్ కూడా ఇదే తరహా కామెంట్స్ చేసింది. తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ ని కేవలం రొమాంటిక్ సన్నివేశాల కోసం , సాంగ్స్ కోసమే వాడుకుంటారు అంటూ చెప్పుకొచ్చింది. ఇక తాప్సి గురించి సరేసరి. ఈమెని వెండితెర కి పరిచయం చేసింది రాఘవేంద్ర రావు. ఆయన ఈమెని చూపించిన విధానం కి మొదటి సినిమాతోనే ఈమెకు యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఈమె టాలీవుడ్ మేకర్స్ కి హీరోయిన్స్ అందాలను ఎక్స్ పోజ్ చేయడం మాత్రమే వచ్చి , మంచి పాత్రలు రాయడం రాదు అంటూ బాలీవుడ్ కి వెళ్లి కామెంట్స్ చేసింది.
ఇక రీసెంట్ పెద్ది చిత్రం లో హీరోయిన్ గా నటించిన జాన్వీ కపూర్ కూడా మన టాలీవుడ్ పై విమర్శలు చేయడం మొదలు పెట్టింది. ఈమె బాలీవుడ్ లో డజనుకు పైగా సినిమాలు చేసింది. ఒక్కటంటే ఒక్క సక్సెస్ కూడా రాలేదు. కానీ టాలీవుడ్ లో ఈమె చేసిన దేవర , పెద్ది చిత్రాలు సక్సెస్ అయ్యాయి. తెలుగు ఆడియన్స్ ఈమెను ఆదరించారు. అయినప్పటికీ ఈమె టాలీవుడ్ మేకర్స్ ని తప్పుబట్టింది. సౌత్ మేకర్స్ తమ బౌండెడ్ స్క్రిప్ట్స్ లో కెమెరా యాంగిల్స్ గురించి రాయరని , పెద్ది లో కూడా అదే జరిగిందని , కమిట్ అవ్వడం తో ఇష్టం లేకపోయినా డైరెక్టర్ చెప్పినట్టు అందాలను ఆరబోయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇలా వీళ్లంతా టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకోవడం , బాలీవుడ్ కి వెళ్లి టాలీవుడ్ ని విమర్శించడం ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి వాళ్లకు అసలు మన టాలీవుడ్ మేకర్స్ అవకాశాలు ఇవ్వకూడదు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి డిమాండ్ వినిపిస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.