Ramayan Movie Review: నితీష్ తివారీ దర్శకత్వం లో తెరకెక్కిన ‘రామాయణ’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం , హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. వందల కోట్ల బడ్జెట్ , అత్యంత భారీగా నిర్మించిన ఈ చిత్రం పై అభిమానుల్లో ప్రేక్షకుల్లో అంచనాలు మొదటి నుండి భారీగానే ఉండేవి. కానీ టీజర్ విడుదల సమయం లో ఈ చిత్రం విమర్శలను ఎదురుకోవాల్సి వచ్చింది. కానీ సోనీ పిక్చర్స్ సంస్థ భాగస్వామ్యం తీసుకున్న తర్వాత గ్రాఫిక్స్ లో పీక్ క్వాలిటీ కనిపించింది. థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసినప్పుడు అందరూ షాక్ కి గురయ్యారు. ఈ రేంజ్ అద్భుతమైన విజువల్స్ ని అసలు ఊహించలేదంటూ కామెంట్స్ చేశారు. ట్రైలర్ విడుదల తర్వాత ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెడితే టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. ఒక్క నార్త్ అమెరికా లోనే ప్రీ సేల్స్ ద్వారా 1.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమాకు ఎలాంటి హైప్ ఏర్పడింది అని చెప్పడానికి. అయితే ఈ హైప్ ని సినిమా మ్యాచ్ చేసిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
రామాయణం కథ మనకి కొత్తేమి కాదు. ఇది వరకు ఎన్నో సినిమాలు, సీరియల్స్ ద్వారా మనమంతా చూసే ఉంటాము. ముఖ్యంగా పుస్తకాల్లో రామాయణం చదివితే మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ప్రతీ ఘట్టం హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంది. ఎన్నో జీవిత పాఠాలను కూడా నేర్పిస్తుంది. దీన్ని నేటి తరం దర్శకులు వెండితెర పై అద్భుతంగా ప్రెజెంట్ చేయడం లో విఫలం అయ్యారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఆది పురుష్’ చిత్రం , మన మహోన్నత రామాయణం గాధని అపహాస్యం చేసినట్టు అయ్యింది. తీవ్రమైన విమర్శలను కూడా ఎదురుకుంది. మళ్లీ రామాయణం తీస్తే చూస్తారా? అనే సందేహాలు ఉన్న సమయంలో నితీష్ తివారీ ‘రామాయణ’ చిత్రాన్ని ప్రకటించాడు.
ఈ చిత్రాన్ని ఆయన రెండు భాగాలుగా తీసిన సంగతి తెలిసిందే. ఈరోజు విడుదలైన మొదటి భాగం లో శ్రీ రాముడు వన వాసం కి వెళ్లడం , సీత ని పెళ్లాడడం, రావణుడు సీత ని అపహరించి లంక కి తీసుకెళ్లడం , శ్రీ రాముడు తన వానర సైన్యం తో లంక పై దండయాత్ర చేసి రావణుడిని సంహరించి సీతని తీసుకొని అయోధ్య కి తిరోగొచ్చి పట్టాభిషేకం చేసుకోవడం వరకు చూపించారు. ఇక రాముడి పాలన , సీతని అడవులకు పంపించే సందర్భం , లవ కుశ ప్రస్తావన రెండవ భాగం లో చూడవచ్చు.
ఇక సినిమా విషయానికి వస్తే , విజువల్స్ మనం ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రాన్ని చూస్తే మంచి ఐమాక్స్ థియేటర్ లోనే చూడాలి , అప్పుడే అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి ని పొందగలం. రావణుడిగా యాష్ చెలరేగిపోయి నటించాడు. సినిమా ఆరంభం ఆయనతోనే అవుతుంది. ఇక రాముడిగా రణబీర్ కపూర్ సూట్ అవుతాడో లేదో అని అంతా అనుకున్నారు. కానీ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఆయన పలికించిన భావోద్వేగాలు చాలా నాచురల్ గా ఉన్నాయి. ఇక సీత గా సాయి పల్లవి నటన బాగానే ఉంది కానీ, ఎక్కడో ఆమె పాత్రలో న్యాచురాలిటీ మిస్ అయ్యింది. ఇక హనుమంతుడిగా సన్నీ డియోల్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఆయన వచ్చిన సన్నివేశాలకు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఇక ఈ సినిమాలో సూర్పనక్క క్యారెక్టర్ లో కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి మాట్లాడుకోవాలి. వెండితెర మీద ఆమె కనిపించినంత సేపు , ఇంత అందమైన అమ్మాయిని రాక్షసి క్యారెక్టర్ లో చూపించాలనే ఆలోచన డైరెక్టర్ కి ఎలా వచ్చింది అని అనిపించక తప్పదు.
రామాయణం లో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. దాన్ని పర్ఫెక్ట్ గా వెండితెర మీద ఆవిష్కరిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు నెలకొంటాయి. డైరెక్టర్ నితీష్ అదే చేసాడు. ఒక పక్క గ్రాండియర్ విజువల్స్ చూపిస్తూనే , మరో పక్క ఎమోషన్ తో ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా చేసాడు. ఓవరాల్ గా రామాయణం ని వెండితెర మీద ఈమధ్య కాలం లో ఇంత అద్భుతంగా ఎవ్వరూ ఆవిష్కరించలేదు అనే చెప్పాలి. స్టార్ క్యాస్ట్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాస్త బెటర్ గా ఉండుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి మా ఓకే తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.5/5..మీ కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్స్ లో కచ్చితంగా చూడాల్సిన సినిమా, మిస్ అవ్వకండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.