Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Brand Image: ఏపీ బ్రాండ్ ఇమేజ్ అంటే అట్లుంటది మరి

Andhra Pradesh Brand Image: ఏపీ బ్రాండ్ ఇమేజ్ అంటే అట్లుంటది మరి

Andhra Pradesh Brand Image: ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విజయవాడలో అక్టోబర్ 16 నుంచి 18 వరకు జరిగే విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలకు భారత్లోని చైనా రాయబారి జు ఫేయిహాంగ్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. చంద్రబాబు ఆహ్వానాన్ని ఆయన అంగీకరించినట్టు తెలుస్తోంది. విజయవాడ ఉత్సవ్ 2.0 కు హాజరుకావాలని సీఎం చంద్రబాబు పంపిన ఆహ్వానానికి చైనా రాయబారి సానుకూలంగా […]

Andhra Pradesh Brand Image: ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విజయవాడలో అక్టోబర్ 16 నుంచి 18 వరకు జరిగే విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలకు భారత్లోని చైనా రాయబారి జు ఫేయిహాంగ్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. చంద్రబాబు ఆహ్వానాన్ని ఆయన అంగీకరించినట్టు తెలుస్తోంది.

విజయవాడ ఉత్సవ్ 2.0 కు హాజరుకావాలని సీఎం చంద్రబాబు పంపిన ఆహ్వానానికి చైనా రాయబారి సానుకూలంగా స్పందించారు. తన సతీమణి యుక్సియు తో కలిసి చైనా రాయబారి విజయవాడకు వస్తున్నట్లు తెలుస్తోంది.

భారత్, చైనా ప్రపంచంలోనే ప్రాచీన నాగరికతకు ప్రతీకలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలు బలోపేతం కావలసిన అవసరం ఉంది. విజయవాడ ఉత్సవ్ 2.0 వంటి కార్యక్రమాలకు అంతర్జాతీయ ప్రతినిధులు హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకోనుంది. చైనా రాయబారి పర్యటన ఖరారు అయితే.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ సందర్భంగా రెండు దేశాల మధ్య సహకార అవకాశాలపై చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అయితే, సమావేశంలో చర్చించబోయే అంశాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

అక్టోబర్ 16 నుంచి 18 వరకు జరిగే విజయవాడ ఉత్సవ్ 2.0 ద్వారా నగర సంస్కృతి, సంప్రదాయాల, కళలు, పర్యటక ఆకర్షణలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇలాంటి వేడుకలు స్థానిక కళాకారులకు వేదిక కల్పించడంతోపాటు పర్యాటక రంగానికి, స్థానిక వ్యాపారాలకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తాయి.

అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటే విజయవాడకు మరింత ప్రచారం లభించే అవకాశం ఉంది. తద్వారా అమరావతి ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక ప్రదేశాలపై విదేశీ సందర్శకుల ఆసక్తి పెరిగే అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు రావాలంటే కేవలం ప్రముఖుల పర్యటనలు మాత్రమే కాకుండా, నిరంతర పర్యాటక డెవలప్మెంట్ మౌలిక వసతులు, ఇన్వెస్ట్ మెంట్లకు అనుకూల వాతావరణం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కూడా కీలకం, విజయవాడ ఉత్సవం ఆ దిశగా ఉపయోగపడితే రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరి అవకాశం ఉంది. మొత్తంగా, చైనా రాయబారి రావడం ద్వారా విజయవాడ ఉత్సవ్ 2.0 అంతర్జాతీయ ప్రాధాన్యం పెరగనుంది. రాష్ట్ర సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత బలోపేతం చేసేందుకు ఈ వేడుక ఒక అవకాశం గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper