Homeఆంధ్రప్రదేశ్‌YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో మనీ ట్రైల్.. వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారిస్తున్న...

YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో మనీ ట్రైల్.. వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారిస్తున్న ED .. ఏం జరగనుంది..

YS Bhaskar Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సిబిఐ దర్యాప్తుతో రాజకీయంగా తీవ్ర చర్చకు ఈ కేసు దారితీసింది. ఇప్పుడు ED ఆర్థిక లావాదేవీల మీద దృష్టి సారించింది. హత్యకు సంబంధించి నిందితులకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఆ నిధులు ఎవరు సమకూర్చారు.. నగదు చేతులు మారిన తీరు ఏమిటి.. అనే అంశాల మీద అధికారులు ఆరా తీస్తున్నారు. నిధుల బదిలీ మీద మరింత లోతుగా ఈ […]

YS Bhaskar Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సిబిఐ దర్యాప్తుతో రాజకీయంగా తీవ్ర చర్చకు ఈ కేసు దారితీసింది. ఇప్పుడు ED ఆర్థిక లావాదేవీల మీద దృష్టి సారించింది. హత్యకు సంబంధించి నిందితులకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఆ నిధులు ఎవరు సమకూర్చారు.. నగదు చేతులు మారిన తీరు ఏమిటి.. అనే అంశాల మీద అధికారులు ఆరా తీస్తున్నారు.

నిధుల బదిలీ మీద మరింత లోతుగా

ఈ నేపథ్యంలో వైయస్ భాస్కర్ రెడ్డికి ED నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అక్టోబర్ 13న అంటే నేటి మంగళవారం విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వివేకా హత్య కేసులో ఇప్పటికే పలువురిని ED ప్రశ్నించింది. ఇప్పుడు నిధుల బదిలీ మీద మరింత లోతుగా విచారణ సాగుతోందని సమాచారం.

నిధుల మూలాలపై అధికారుల పరిశీలన

సరిగా ఏడు సంవత్సరాల క్రితం మార్చి 15న మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి పులివెందులలో తన నివాసంలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన నాడు ఏపీ రాజకీయాలలో కలకలం రేపింది. కేసు దర్యాప్తును సిబిఐ చేపట్టిన తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలువురి మీద అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ప్రధానంగా ఆర్థిక లావాదేవీల చుట్టూ తిరుగుతోంది. హత్యకు ముందు, తర్వాత జరిగినట్టు అనుమానిస్తున్న నగదు చెల్లింపులు, బ్యాంకు లావాదేవీలు, నిధుల మూలాలపై అధికారులు పరిశీలన జరుపుతున్నట్టు తెలుస్తోంది.ఈ కేసులో నిందితులకు డబ్బులు ఎవరిచ్చారు.. ఆ డబ్బులు ఏ మార్గంలో వారి చేతిలోకి చేరాయి.. మధ్యలో ఎవరైనా ఉన్నారా.. నగదు రూపంలో లావాదేవీలు జరిగాయా.. బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీలు జరిగాయా.. ఈ ప్రశ్నలకు ED విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంది.

40 కోట్ల డీల్ పై ఆరా

వివేక హత్య కేసులో 40 కోట్ల డీల్ జరిగిందని గతంలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారానికి సంబంధించి డబ్బులు.. వాటిని బట్వాడా చేసిన విధానంపై కేంద్ర సంస్థలు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన షేక్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం కూడా దర్యాప్తులో ప్రస్తావనకు వచ్చింది. హత్యకు సంబంధించిన డబ్బులు చెల్లింపులు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో.. ఆ సొమ్ముు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరికి ఏ స్థాయిలో అందింది.. అనే అంశాల మీద అధికారులు వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. 40 కోట్ల డీల్ కు సంబంధించిన ఆరోపణలు.. అందులో ఎవరి పాత్ర ఎంత అనే అంశాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది . ఇప్పటికే కీలకమైన ఆధారాలు సేకరించిన నేపథ్యంలో.. భాస్కర్ రెడ్డి పై ఈడీ గట్టిగానే ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper