Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu: కొండలు కోనలు దాటి.. ఏజెన్సీ ప్రజల గుమ్మం ముందుకు.. చంద్రబాబు సర్కారు చేసిన...

Chandrababu Naidu: కొండలు కోనలు దాటి.. ఏజెన్సీ ప్రజల గుమ్మం ముందుకు.. చంద్రబాబు సర్కారు చేసిన సంజీవని ప్రయత్నం ఇది..

Chandrababu Naidu: పురాణ కాలంలో రాక్షసులు.. రాముడి పరివారం యుద్ధం చేసినప్పుడు.. ఆ పోరాటంలో లక్ష్మణుడు మూర్చ పోతాడు. ఆ సమయంలో హనుమంతుడు లక్ష్మణుడిని బతికించడానికి సంజీవని పర్వతాన్ని తీసుకొస్తాడు. గాలిలో తన చేతిలో సంజీవని పర్వతాన్ని అమాంతం లేపుకొని వచ్చి.. లక్ష్మణుడికి పునర్జన్మ అందిస్తాడు. పురాణ కాలంలో దేవతామూర్తుల శక్తులు ఉంటాయి. ఆశక్తుల ద్వారా వారు అసాధ్యమైన పనిని సైతం సుసాధ్యం చేస్తారు. ఇప్పటి కాలంలో అది సాధ్యమా.. పట్టుదల ఉంటే.. చిత్తశుద్ధి ఉంటే.. ఓటు వేసి […]

Chandrababu Naidu: పురాణ కాలంలో రాక్షసులు.. రాముడి పరివారం యుద్ధం చేసినప్పుడు.. ఆ పోరాటంలో లక్ష్మణుడు మూర్చ పోతాడు. ఆ సమయంలో హనుమంతుడు లక్ష్మణుడిని బతికించడానికి సంజీవని పర్వతాన్ని తీసుకొస్తాడు. గాలిలో తన చేతిలో సంజీవని పర్వతాన్ని అమాంతం లేపుకొని వచ్చి.. లక్ష్మణుడికి పునర్జన్మ అందిస్తాడు.

పురాణ కాలంలో దేవతామూర్తుల శక్తులు ఉంటాయి. ఆశక్తుల ద్వారా వారు అసాధ్యమైన పనిని సైతం సుసాధ్యం చేస్తారు. ఇప్పటి కాలంలో అది సాధ్యమా.. పట్టుదల ఉంటే.. చిత్తశుద్ధి ఉంటే.. ఓటు వేసి గెలిపించిన ప్రజల మీద ప్రేమ ఉంటే కచ్చితంగా సాధ్యమే అని నిరూపిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఇన్నాళ్లపాటు వైద్య సేవలు అందక.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన మన్యం ప్రజలకు సంజీవని లాంటి పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలుకు తీసుకొచ్చింది. వాస్తవానికి దేశంలో ఇటువంటి సేవలు అందించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చిరస్థాయిగా నిలిచిపోతుంది. అల్లూరు జిల్లాలో డ్రోన్ ద్వారా వైద్య సేవలు అందిస్తూ.. కొండకోనల్లో గిరిజనులకు సరికొత్త భరోసా కల్పిస్తోంది కూటమి ప్రభుత్వం.

అడవులు.. ఎత్తైన కొండలు.. సరైన రహదారులు లేని మారుమూల గ్రామాలు.. అత్యవసర వైద్యం అందాలంటే కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి.. అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజనులకు ఆసుపత్రికి చేరుకోవడమే ఒక పెద్ద సవాల్. గర్భిణులు.. అత్యవసర చికిత్స అవసరమైన రోగుల కష్టాలు వర్ణనాతీతం. ఇలాంటి పరిస్థితుల్లో సాంకేతికత కొత్త ఆశలు నింపుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా మందులు.. రక్తనము నాలు.. వ్యాక్సిన్లు.. వైద్య పరీక్షలు నివేదికలను రవాణా చేస్తూ వైద్య సేవలను వేగంగా చేరువ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన ఈ కార్యక్రమం గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలకు కొత్త దారిని చూపిస్తోంది…

అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో బౌగోళిక పరిస్థితుల కారణంగా వైద్య సేవలు అందించడం ఎప్పటినుంచో ఇబ్బందికరంగా ఉంది. దట్టమైన అడవులు.. కొండ మార్గాలు.. రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల రక్త నమూనాలను ప్రయోగశాలలకు చేర్చడం.. అత్యవసరమైన మందులను గ్రామాలకు పంపించడం ఆలస్యమైన సందర్భాలు అనేక ఉన్నాయి. అందువల్లే ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. రహదారి మార్గంలో ఎక్కువ సమయం పట్టే ప్రాంతాలకు డ్రోన్ మార్గా ల ద్వారా వైద్య సామగ్రిని వేగంగా తరలిస్తున్నారు. దీనివల్ల రోగులపై ప్రయాణభారం తగ్గుతోంది. వైద్య పరీక్షల ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది.

2026లో మొదలైన డ్రోన్ వైద్య రవాణా వ్యవస్థలో 4 డ్రోన్లు సేవలు అందిస్తున్నాయి. సెప్టెంబర్ 2026 నాటికి ఈ డ్రోన్లు 1800 పైగా ట్రిప్పులు పూర్తి చేసి.. 71 వేల కిలోమీటర్ల పైగా ప్రయాణించాయి.

  • 2200కు పైగా వైద్య నమోనాలను రవాణా చేశాయి
  • 596 సికిల్ సెల్ పరీక్షల నమూనాలను తరలించాయి.
  • 9,000 కు పైగా వైద్య పరీక్షలకు సహకారం అందించాయి
  • 24,500 మందికిపైగా రోగులకు ప్రయోజనం కలిగించాయి.

డ్రోన్ సేవలను మరింత విస్తరించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరకు నియోజకవర్గంలోని గన్నెల గ్రామంలో సంజీవని ఆరోగ్య ప్రాజెక్టును ఆగస్టు 29న మొదలుపెట్టారు. గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఆర్కే నగర్ గ్రామానికి వైద్య పరీక్షల నివేదికలను.. వ్యాక్సిన్లు.. మందులను.. డ్రోన్ల ద్వారా తరలించే సేవలకు ఆయన శ్రీకారం చుట్టారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper