Homeఅంతర్జాతీయంDonald Trump: భారత్ చేస్తే సంసారం.. రష్యాతో అమెరికా చేస్తే ప్రపంచ కల్యాణం. అంతేనా ట్రంప్...

Donald Trump: భారత్ చేస్తే సంసారం.. రష్యాతో అమెరికా చేస్తే ప్రపంచ కల్యాణం. అంతేనా ట్రంప్ సారూ

Donald Trump: ఈ సామెత మీకు బాగా వర్తిస్తుందేమో అమెరికా అధ్యక్షులవారు.. అయినా ట్రంప్ సారూ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే అది తప్పు . ఆంక్షలను ఉల్లంఘించినట్టే. ప్రపంచ శాంతికి విగాథం కలిగించినట్టే. కానీ అమెరికా రష్యా నుంచి చమరుకొనుగోలు చేస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసినట్టు.. ప్రపంచ కళ్యాణ కోసం బాటలు వేసినట్టు.. అంతేనా ట్రంప్ సారూ.. ఒకే చమరు.. ఒకే రష్యా.. ఒకే అంతర్జాతీయ మార్కెట్.. కానీ దేశాన్ని […]

Donald Trump: ఈ సామెత మీకు బాగా వర్తిస్తుందేమో అమెరికా అధ్యక్షులవారు.. అయినా ట్రంప్ సారూ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే అది తప్పు . ఆంక్షలను ఉల్లంఘించినట్టే. ప్రపంచ శాంతికి విగాథం కలిగించినట్టే. కానీ అమెరికా రష్యా నుంచి చమరుకొనుగోలు చేస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసినట్టు.. ప్రపంచ కళ్యాణ కోసం బాటలు వేసినట్టు.. అంతేనా ట్రంప్ సారూ.. ఒకే చమరు.. ఒకే రష్యా.. ఒకే అంతర్జాతీయ మార్కెట్.. కానీ దేశాన్ని బట్టి నీతులు మారిపోతున్నాయి. భారత్ కొంటే తప్పు.. అమెరికా కొంటే ఒప్పు.. భారత్ చేస్తే నేరం.. అమెరికా చేస్తే వ్యూహం..

ఇదే న్యాయం ట్రంప్ సారూ.. అంతర్జాతీయ సంబంధం మనం చేస్తే సంసారం.. వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అనే సామెతనే అమలు చేస్తున్నారా.. ప్రపంచానికి నిధులు చెప్పేముందు ఆ నీతులు మీకు వర్తిస్తాయని గుర్తుంచుకుంటే బాగుంటుంది కదా.. అంతర్జాతీయ రాజకీయాల్లో విధానం ఒక్కటే ఉండాలి. అమెరికాకు ఒకటి.. మిగతా ప్రపంచానికి మరొకటి కాదు..

రష్యా నుంచి భారత్ చమురు కొంటే ఆంక్షలు.. హెచ్చరికలు.. భారత్ తన ప్రయోజనాల కోసం చమరు కొనుగోలు చేస్తే తప్పు చేసినట్టు. తన ప్రయోజనాలకు ఇంధనం అందుబాటులో ఉంచడం నేరం. మరి అదే అమెరికా రష్యా నుంచి చమరు కొనుగోలు చేస్తే మాత్రం అది వ్యూహాత్మక నిర్ణయం.. ప్రపంచ ఆర్థిక స్థిరత్వం కోసం చేసిన మహోపకారం. చమురు అదే.. రష్యా కూడా అదే.. మార్కెట్ కూడా అదే. మారింది మాత్రం కొనుగోలు చేస్తున్న దేశం మాత్రమే. మరి నీతులు మాత్రం ఎందుకు మారిపోతున్నాయి..

భారత్ కొనుగోలు చేస్తే ఆంక్షల ఉల్లంఘన.. అమెరికా కొనుగోలు చేస్తే జాతీయ ప్రయోజనం.. భారత్ కొనుగోలు చేస్తే తప్పిదం.. అమెరికా కొనుగోలు చేస్తే దౌత్య విజయం.. అమెరికా ప్రయోజనమే ప్రపంచ ప్రయోజనమా.. మిగతా దేశాల ప్రయోజనాలకు విలువ ఏమి లేదా..

వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా నుంచి చేస్తున్నారనే వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇది ముడి చమురు కొనుగోలు కంటే.. ప్రధానంగా డీజిల్ సరఫరాకు సంబంధించిన తాజా ఒప్పందం. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఇంధన దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడంతో తాత్కాలికంగా ఆ విధానాన్ని సడలించింది.

ట్రంప్ చెప్పిన వివరాల ప్రకారం రష్యా నుంచి అమెరికా తొలివిడతగా మూడు లక్షల టన్నులకు పైగా డీజిల్ కొనుగోలు చేస్తుంది. నవంబర్లో అదనంగా 5 లక్షల టన్నులు కొనుగోలు చేస్తుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన కష్టమైన డాలర్ విలువను అమెరికా లేదా రష్యా అధికారికంగా వెల్లడించలేదు. తొలి విడత మూడు లక్షల టన్నులకు పైగా అంటే సుమారు 22.5 లక్షల పీపాలు. బ్యారెల్ కు సుమారు 100 నుంచి 150 డాలర్లను కేవలం లెక్కింపు ప్రకారం ఊహిస్తే తొలి విడత సుమారు 225 నుంచి 338 మిలియన్ డాలర్లు అవుతుంది.

ఎందుకు కొనుగోలు చేస్తోంది

ఇరాన్ యుద్ధం.. అంతర్జాతీయంగా సరఫరాలో అంతరాల వల్ల అమెరికాలో డీజిల్ ధరలు తీవ్రంగా పెరిగాయి. రవాణా.. వ్యవసాయం.. సరుకు సరఫరా ఖర్చులు పెరిగితే ధరలపై ప్రభావం ఉంటుంది.డీజిల్ ధరలు పెరిగితే ట్రక్కుల రవా.. రైతుల యంత్రాలు.. సరుకు రవాణా ఖర్చులు పెరుగుతాయి. వాటి ప్రభావం అనేక వస్తువుల ధరల మీద పడుతుంది. అందుకే అదనపు డీసీ సరఫరాతో ధరలకు ఒత్తిడిని తగ్గించాలని ట్రంప్ భావిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జరిపిన చర్చల అనంతరం ట్రంప్ ఈ ప్రకటన చేశారు. రష్యా డీజిల్ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను అమెరికా తాత్కాలికంగా పక్కన పెట్టింది. అయితే ఈ నిర్ణయం ఉక్రెయిన్ కు మద్దతు ఇచ్చే అమెరికా విధానంపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. నవంబర్ 3 2026న అమెరికాలో మద్యంతర ఎన్నికల జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన ధరలు ట్రంప్ కు ఇబ్బందిగా మారాయి. అందువల్లే తర్వాత నుండి తగ్గించే ప్రయత్నాలకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది .

ఇక 2021లో అమెరికా దిగుమతి చేసుకున్న మొత్తం పెట్రోలియం ఉత్పత్తుల్లో రష్యా వాటా సుమారు 8 శాతం. ఇందులో క్రూడ్ ఆయిల్ వాటా మూడు శాతం. ఇతర పెట్రోలియం ఉత్పత్తుల వాటా ఎక్కువగా ఉన్నది కానీ ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో 2022లో అమెరికా రష్యా చమురు, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించింది. .

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper