Elon Musk: ప్రపంచ కుబేరుడు.. స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కు, రిలయన్స్ అధినేత ముఖ్య అంబానికి మధ్య స్టార్ లింక్ విషయంలో మాటల యుద్ధం నడుస్తోంది. భారత్ లో తన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యం కావడంపై మస్క్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, భారత ప్రభుత్వం మాత్రం భద్రతా నిబంధనలు, స్పెక్ట్రమ్ కేటాయింపు వంటి అంశాలు పూర్తయిన తర్వాతే సేవలకు అనుమతి ఇస్తామని చెబుతోంది.
వివాదం ఎందుకు మొదలైంది
మనదేశంలో ఇప్పటికే టెలికాం సంస్థలు బలంగా ఉన్నాయి. తమ వ్యాపార ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందువల్లే స్టార్ లింక్ ప్రవేశాన్ని అవి అడ్డుకుంటున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముకేశ్ అంబానీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అనుమతులను అడ్డుకుంటున్నారని మస్క్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆయన సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రకటనలు చేస్తున్నారు.
భారత మార్కెట్లో ప్రవేశించడంలో జాప్యం
స్టార్ లింక్ భారతదేశంలో సేవలు ప్రారంభించేందుకు గడచిన నాలుగు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది. కీలకమైన అనుమతులు లభించినప్పటికీ.. కమర్షియల్ సర్వీస్ మొదలు పెట్టడానికి అవసరమైన అనుమతులు ఇంకా రాలేదు.
మార్కెట్ పై పోటీ
రిలయన్స్ ఆధ్వర్యంలో నడిచే జియో.. ఎయిర్టెల్ ఇప్పటికే మన దేశం రంగంలో బలమైన స్థానాలలో ఉన్నాయి. ఒకవేళ స్టార్ లింక్ కనక ప్రవేశిస్తే మారుమూల ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవల కోసం ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంది.
ప్రయోజనాలపై అనుమానం
తమ ప్రవేశాన్ని అటుకోవడానికి భారతదేశంలో ఉన్న వ్యాపార దిగజాలు ప్రయత్నిస్తున్నాయని మస్కా ఆరోపించారు. ఆ తర్వాత ముకేశ్ అంబానీ ఉద్దేశించి.. మనదేశంలో అధికారం ఆయన చేతిలో ఉంది అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఆరోపణలకు మస్క్ ఎటువంటి ఎవిడెన్స్ చూపించలేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మస్క్ చేసినవి ఆరోపణలు మాత్రమే.. రిలయన్స్ ఉద్దేశపూర్వకంగా స్టార్ లింక్ ను అడ్డుకుంటున్నదని ఎక్కడా కూడా నిర్ధారణ కాలేదు.
ప్రభుత్వం అడ్డుకోవడం వెనుక..
- స్టార్ లింక్ శాటిలైట్ నెట్వర్క్ ద్వారా జరిగే సమాచారం మార్పిడిని భారత భద్రత సంస్థలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించగలగాలి. అత్యవసరమైన పరిస్థితుల్లో నిర్దిష్టమైన ప్రాంతాలలో సేవలను నిలిపివేగల సామర్థ్యం కూడా ముఖ్యమైన అంశం. స్టార్ లింక్ ఉపగ్రహాల మధ్య నేరుగా సమాచార మార్పిడి జరిగే విధానం వల్ల భారతీయ నెట్వర్క్ నియంత్రణపై అధికారులు అదనపు పరిశీలన చేస్తున్నారు…
- శాటిలైట్ ఇంటర్నెట్ కి అవసరమైన రేడియో ఫ్రీక్వెన్సీ లను ఏ విధంగా.. ఎంత ధరకు కేటాయించాలని అంశంపై ప్రభుత్వం ఇంకా తుది విధానాన్ని ఖరారు చేయలేదు. మనదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు లైసెన్సు ఉండడం ఒకటే మార్గం కాదు.
- స్టార్ లింక్ విదేశీ సంస్థ కావడంతో.. అనేక రకాల అంశాలను పరిశీలిస్తున్నారు. వినియోగదారుల సమాచార భద్రత.. చట్టపరమైన సమాచార పర్యవేక్షణ వంటి అంశాలను ప్రభుత్వం జాగ్రత్తగా చూస్తోంది.
అంబానికి కేంద్రం మద్దతు ఇస్తోందా?
ప్రస్తుతం ఈ ప్రశ్న వివాదానికి కేంద్రంగా ఉంది. కేంద్ర సమాచార ప్రసరణ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. భారతదేశంలో ఏ రంగంలో కూడా ఏక ఆధిపత్యాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. స్టార్ లింక్.. జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్.. ఎయిర్టెల్ కు మొదట ఇస్తున్న యూ టెల్ సాట్ వన్ వెబ్ సంస్థలు భద్రత నిబంధనలు.. ఇతర అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని ఆయన ప్రకటించారు. స్టార్ లింక్.. రిలయన్స్ జియో మధ్య గతంలోనే భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. అలాగే ఎయిర్టెల్ స్టార్ లింక్ డీల్ కూడా కుదుర్చుకున్నాయి.
స్టార్ లింక్ వస్తే ఏమవుతుంది
- మారుమూల గ్రామాలు.. కొండ ప్రాంతాలు.. అటవీ ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించే అవకాశం ఉంటుంది.
- మొబైల్ టవర్లు లేదా ఫైబర్ కేబుల్లు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది. కష్టమైన ప్రాంతాలకు ప్రత్యామ్నాయ కనెక్టివిటీ ఏర్పాటవుతుంది.
- ఆన్లైన్ విద్య.. టెలి మేడిసన్.. చిన్న వ్యాపారాలకు మెరుగైన ఇంటర్నెట్ అవకాశాలు సాధ్యమవుతాయి.
- శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో పోటీ పెరుగుతుంది.
స్టార్ లింక్ ధరలు ఎలా ఉంటాయి.. సాధారణ వినియోగదారులకు అవి అందుబాటులో ఉంటాయా.. సేవలలో బేగం ఎలా ఉంటుంది అనే అంశాలపై ఇంకా క్లారిటీకి రావాల్సి ఉంది..
చివరగా ఇది కేవలం మస్క్ వర్సెస్ అంబానీ వివాదం అస్సలు కాదు. భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్లోకి ప్రవేశించాలి అనుకున్న విదేశీ సంస్థకు అనుమతులు ఇవ్వడం.. నేషనల్ సెక్యూరిటీని కాపాడటం.. డొమెస్టిక్ టెలికాం సంస్థలతో సమన పోటీని నిర్ధారించడం వంటి అంశాల మధ్య జరుగుతున్న వివాదం..మస్క్ వేగంగా భారతీయ మార్కెట్లోకి రావాలి అనుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం భద్రతా అనుమానాలను.. స్పెక్ట్రమ్ కేటాయింపులను.. ఇతర అంశాలు పూర్తి అయిన తర్వాతే సేవలు మొదలుపెట్టాలని చెబుతోంది. అనుమతుల ఆలస్యమేనక రాజకీయ లేదా వ్యాపార ఒత్తిడి ఉందన్న మస్క్ ఆరోపణలకు ఇంతవరకు స్పష్టమైన ఆధారాలు లేవు.