Homeఆంధ్రప్రదేశ్‌AP Panchayat Elections : పంచాయితీ ఎన్నికల వాయిదాకు జగన్ పెద్ద ప్లాన్?!

AP Panchayat Elections : పంచాయితీ ఎన్నికల వాయిదాకు జగన్ పెద్ద ప్లాన్?!

AP Panchayat Elections : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందే రాజకీయ వేడి రాజుకుంది. ఒకవైపు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం.. మరోవైపు అదే రిజర్వేషన్లను కోర్టులో సవాలు చేసిన పిటిషన్లు.. తాజాగా హైకోర్టు తీర్పు.. ఆ తర్వాత సుప్రీంకోర్టు మెట్లెక్కిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇదంతా కేవలం న్యాయపరమైన వివాదమేనా? లేక స్థానిక ఎన్నికల వెనుక పెద్ద రాజకీయ వ్యూహం నడుస్తోందా? అసలు వివాదం ఎక్కడ మొదలైంది? ఆగస్టు 20, 2026న ఏపీ […]

AP Panchayat Elections : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందే రాజకీయ వేడి రాజుకుంది. ఒకవైపు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం.. మరోవైపు అదే రిజర్వేషన్లను కోర్టులో సవాలు చేసిన పిటిషన్లు.. తాజాగా హైకోర్టు తీర్పు.. ఆ తర్వాత సుప్రీంకోర్టు మెట్లెక్కిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇదంతా కేవలం న్యాయపరమైన వివాదమేనా? లేక స్థానిక ఎన్నికల వెనుక పెద్ద రాజకీయ వ్యూహం నడుస్తోందా?

అసలు వివాదం ఎక్కడ మొదలైంది?

ఆగస్టు 20, 2026న ఏపీ ప్రభుత్వం జారీ చేసిన G.O.Ms.No.105 ద్వారా పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి 50 శాతం పరిమితిని దాటుతున్నాయంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. అక్టోబర్ 1న ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 34 శాతం బీసీ రిజర్వేషన్‌కు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా గరిష్ఠంగా ఆరు వారాల్లో ప్రారంభించాలని ఆదేశించింది.

ఇక్కడే రాజకీయ అసలు కథ మొదలవుతోంది!

వైసీపీ వర్గాలు మాత్రం 34 శాతం బీసీ కోటా చట్టపరమైన పరిమితులను దాటుతుందని ముందే హెచ్చరించామని చెబుతున్నాయి. వైసీపీ అధికారిక వాదన ప్రకారం.. ప్రభుత్వం చట్టపరమైన సమస్యలు వస్తాయని తెలిసినా 34 శాతం కోటాను ప్రకటించి తర్వాత కోర్టు అడ్డంకిని రాజకీయంగా ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం మాత్రం బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే 34 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చామని చెబుతోంది.

అయితే జగన్‌పై వస్తున్న ఆరోపణల సంగతేంటి?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానిక ఎన్నికలను ఎదుర్కోవడానికి భయపడుతున్నారని, అందుకే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని న్యాయపరమైన వివాదంగా మార్చి ఎన్నికలను ఆలస్యం చేయాలని చూస్తున్నారని కూటమి వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఈ ఆరోపణల వెనుక ఉన్న రాజకీయ లెక్క ఏమిటంటే..

పంచాయతీ ఎన్నికలు జరిగితే గ్రామస్థాయిలో అధికార పార్టీ, ప్రతిపక్షాల బలాబలాలు స్పష్టంగా బయటపడతాయి. ఎవరి క్యాడర్ బలంగా ఉంది? ఎవరి నాయకత్వానికి గ్రామాల్లో ఆదరణ ఉంది? ఏ సామాజిక వర్గం ఎటువైపు నిలుస్తోంది? అన్నది ఎన్నికల ఫలితాలతో తేలిపోతుంది. అందుకే స్థానిక ఎన్నికలే ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలకు రాజకీయ పరీక్షగా మారాయి.

నిధుల అంశం కూడా ఎందుకు కీలకం?

స్థానిక సంస్థలకు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో వివిధ గ్రాంట్లు, ఆర్థిక సంఘాల నిధులు, అభివృద్ధి నిధులు అందుతాయి. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2021-26 కాలానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం కింద రూ.10,231 కోట్ల కేటాయింపు ఉండగా రూ.10,055.82 కోట్లు విడుదలయ్యాయి. అయితే రూ.12,000 కోట్ల “పే కమిషన్ నిధులు” ఎన్నికలను ఆపడానికి జగన్ చేస్తున్న కుట్రలో భాగమే ఈ ఎన్నికలు అడ్డుకునే ప్రక్రియ అనే వాదన వినిపిస్తోంది.

ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే!

బీసీ రిజర్వేషన్లను వైసీపీ ఎందుకు అడ్డుకుంటోంది.? ప్రభుత్వం తీసుకొచ్చిన 34 శాతం కోటా చట్టపరమైన పరీక్షను ఎందుకు మోకాలడ్డుతోంది.? టీడీపీకి ఎన్నికల్లో ప్రయోజనం దక్కుండా చేసేందుకే ఈ కుట్ర చేస్తోంది.? ఎన్నికలు ఆలస్యం అయితే రాజకీయంగా వైసీపీకి లాభమా? గ్రామీణ స్థాయిలో బలాబలాలు బయటపడకుండా ఎన్నికల ప్రక్రియను సాగదీయడం వైసీపీ వ్యూహమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో కోర్టు తీర్పులతో పాటు రాజకీయ పరిణామాలు కూడా ఇవ్వనున్నాయి.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అక్టోబర్ 9న ఈ అంశంపై సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరగనుంది. కాబట్టి.. ఇది కేవలం 34 శాతం బీసీ రిజర్వేషన్ వివాదం కాదు. ఇది గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతున్న మరో పెద్ద పోరాటం.

ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? బీసీలకు చివరకు ఎంత రిజర్వేషన్ దక్కుతుంది? కోర్టు నిర్ణయం ఎటువైపు ఉంటుంది? మరి ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయంగా లాభపడేది ఎవరు? సమాధానం కోసం రాబోయే పరిణామాలను గమనించాల్సిందే!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper