Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu Health Secrets: ఏడుపదుల వయసులో పాతికేళ్ల ఉత్సాహం.. తన హెల్త్ సీక్రెట్ ఏంటో...

Chandrababu Naidu Health Secrets: ఏడుపదుల వయసులో పాతికేళ్ల ఉత్సాహం.. తన హెల్త్ సీక్రెట్ ఏంటో చెప్పిన చంద్రబాబు

Chandrababu Naidu Health Secrets: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వయసు ఏడు పదులు దాటింది. అయినప్పటికీ ఆయన ఉత్సాహంగా పనిచేస్తుంటారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు.. అధికారులతో సమీక్షలు.. సమావేశాలు.. క్షణం తీరిక లేకుండా ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. అధికార పక్షంలో ఉన్నప్పటికీ.. చంద్రబాబు తీరు మారదు. ఆయన నిత్యం పనిచేస్తూనే ఉంటారు. పనిచేయాలని చెబుతుంటారు. చంద్రబాబు వయసు మాతమే పెరుగుతోంది. కానీ ఆయన ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడు గానే ఉంటున్నారు. ఎందుకంటే ఆయన తీసుకునే మితాహారం.. సాత్విక ఆలోచనలు.. యోగ.. […]

Chandrababu Naidu Health Secrets: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వయసు ఏడు పదులు దాటింది. అయినప్పటికీ ఆయన ఉత్సాహంగా పనిచేస్తుంటారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు.. అధికారులతో సమీక్షలు.. సమావేశాలు.. క్షణం తీరిక లేకుండా ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. అధికార పక్షంలో ఉన్నప్పటికీ.. చంద్రబాబు తీరు మారదు. ఆయన నిత్యం పనిచేస్తూనే ఉంటారు. పనిచేయాలని చెబుతుంటారు.

చంద్రబాబు వయసు మాతమే పెరుగుతోంది. కానీ ఆయన ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడు గానే ఉంటున్నారు. ఎందుకంటే ఆయన తీసుకునే మితాహారం.. సాత్విక ఆలోచనలు.. యోగ.. మెడిటేషన్ వంటివి ఆయన ఆరోగ్యాన్ని నిత్య యవ్వనంగా ఉంచుతున్నాయి. కేవలం చంద్రబాబు మాత్రమే కాదు.. ఆయన సతీమణి భువనేశ్వరి కూడా ఇలాంటి ఆరోగ్య విధానాలనే పాటిస్తూ ఉంటారు. అందువల్లే వారిద్దరు ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఉంటారు.

ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు ఈసారి పూర్తి భిన్నత్వాన్ని చూపిస్తున్నారు. ప్రజలతో ఎక్కువగా కలిసిపోతున్నారు. వారితో మాట్లాడుతున్నారు. వారింట్లో వండిన వంటలు అన్నం తింటున్నారు. సాధారణంగా తినే ఆహారాన్ని కొలతలు వేసుకొని మరీ ఆరగిస్తూ ఉంటారు చంద్రబాబు. పైగా ఆయన చేడు చేసే ఆహారాన్ని అస్సలు తినరు. మాంసం మితంగా తింటారు. మద్యం అసలు తాగరు. బ్లాక్ కాఫీ ఇష్టపడుతుంటారు. ఆహారంలో కార్బోహైడ్రేట్ల నుంచి మొదలుపెడితే ప్రోటీన్ ల వరకు ఉండేలాగా చూసుకుంటారు. అందువల్లే చంద్రబాబు ఈ వయసులో కూడా ఉత్సాహంగా ఉంటున్నారు.

ఇటీవల తరచుగా ఆయన ప్రజలతో మమేకమవుతున్నారు. పొలిటికల్ డిస్కషన్స్ పక్కనపెట్టి తినే తిండి, పాటించాల్సిన అలవాట్ల గురించి వివరిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ సభలో చంద్రబాబు తన డైట్ గురించి చెప్పారు. ఇటీవల కాలంలో చంద్రబాబు డైట్ ప్లాన్ పూర్తిగా చేంజ్ చేశారు. ప్రతిరోజు గుడ్లను మెనూలో నమోదు చేసుకున్నారు. అది కూడా ఎగ్ వైట్ ఆమ్లెట్ వేసుకొని తింటున్నారు. ఎట్టి పరిస్థితిలో ఆయన ఎల్లో తినరు. జంక్ ఫుడ్ ముట్టుకోరు. వాకింగ్.. రన్నింగ్ స్కిప్ చేయరు. యోగ.. మెడిటేషన్ చేస్తూ ఉంటారు. సాత్విక ఆలోచనలు మాత్రమే చేస్తారు. నెగిటివిటీకి.. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటారు. అందువల్లే చంద్రబాబు ఈ స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారు.

ఎన్నికల సమయంలో కాకలు తీరిన నాయకులు కూడా ప్రచారంలో ఇబ్బంది పడ్డారు. ఎండ వేడికి తట్టుకోలేక అవస్థలు ఎదుర్కొన్నారు. కానీ చంద్రబాబు ఎటువంటి ఇబ్బందిలేకుండా ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. రోజుకు తక్కువలో తక్కువ ఐదు నుంచి ఏడు సభల్లో పాల్గొన్నారు. ప్రజలందరినీ కలిశారు. రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేశారు. తద్వారా యంగ్ పొలిటికల్ లీడర్లు ఆశ్చర్యపోయారు. తనతో పోటీకి సిద్ధమా అంటూ సంకేతాలు పంపించారు. కానీ వారు ఎవరు కూడా చంద్రబాబుతో పోటీ పడలేకపోయారు. ఎందుకంటే అటు అభివృద్ధిలో.. ఇటు సంక్షేమంలో.. చివరికి ఆరోగ్యం కూడా చంద్రబాబు సృష్టించిన బెంచ్ మార్క్ మామూలుది కాదు. ఎందుకంటే ఆయన రూటే సపరేటు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper