HomeజాతీయంGwalior Viral Video: భార్యను జూకు తీసుకెళ్లిన కొత్త పెళ్ళికొడుకు.. బైక్ పార్క్ చేసి వచ్చేలోపే...

Gwalior Viral Video: భార్యను జూకు తీసుకెళ్లిన కొత్త పెళ్ళికొడుకు.. బైక్ పార్క్ చేసి వచ్చేలోపే ప్రియుడితో పరార్.. వైరల్ వీడియో

Gwalior Viral Video: కొత్తగా పెళ్లయింది. భార్యతో సరదాగా గడపాలి అనుకున్నాడు. ఇందులో భాగంగా ఆమెను జూకు తీసుకెళ్లాడు. కానీ, అక్కడ అతడికి ఊహించని షాక్ ఎదురైంది. బైక్ పార్క్ చేసి వచ్చేలోపే భార్య కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. చివరికి ఆమె తన ప్రియుడితో కలిసి మరో బైక్ పై వెళ్లిపోయినట్టు తెలిసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటన చర్చకు దారి తీస్తోంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతానికి […]

Gwalior Viral Video: కొత్తగా పెళ్లయింది. భార్యతో సరదాగా గడపాలి అనుకున్నాడు. ఇందులో భాగంగా ఆమెను జూకు తీసుకెళ్లాడు. కానీ, అక్కడ అతడికి ఊహించని షాక్ ఎదురైంది. బైక్ పార్క్ చేసి వచ్చేలోపే భార్య కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. చివరికి ఆమె తన ప్రియుడితో కలిసి మరో బైక్ పై వెళ్లిపోయినట్టు తెలిసింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటన చర్చకు దారి తీస్తోంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన 21 సంవత్సరాల యువకుడికి ఇటీవల 18 సంవత్సరాల యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత భార్యతో కలిసి బయటికి వెళ్లాలని అతడు భావించాడు. ఆమెను జూకు తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి సరదాగా గడపాలనే ఉద్దేశంతో అతడు అక్కడికి చేరుకున్నాడు. జూ వద్దకు చేరుకున్న తర్వాత భర్త తన బైక్ ను పార్క్ చేయడానికి వెళ్ళాడు. ఆ పని ముగించుకుని వచ్చేసరికి భార్య అక్కడ కనిపించలేదు. దీంతో అతడు అయోమయానికి గురయ్యాడు. చుట్టుపక్కల ఆమె కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆందోళనకు గురయ్యాడు.

భార్య కనిపించకుండా పోవడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆ భర్త ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె ఆర్మాన్ ఖాన్ అనే వ్యక్తితో కలిసి వెళ్లిపోయినట్టు భర్త గుర్తించాడు. పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ఆర్మాన్ ఖాన్ బైక్ మీద తన భార్య వెళ్ళిపోయిందని.. పోలీసుల దృష్టికి అతడు తీసుకొచ్చాడు. భార్యను సరదాగా బయటకు తీసుకెళ్లిన సమయంలోనే ఈ సంఘటన జరగడం విశేషం. కొత్తగా పెళ్లయిన కొద్ది రోజులకే చోటు చేసుకున్న ఈ పరిణామం స్థానికంగా సంచలనానికి కారణమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. భర్త ఫిర్యాదు మేరకు కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆయన భార్య ఎవరితో వెళ్ళింది. వెళ్లడానికి గల కారణాలేంటి.. భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా జరిగాయా.. అందువల్లే ఆమె వెళ్లిపోయిందా.. అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ఎంక్వయిరీలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

మొత్తానికి భార్యతో కలిసి ఆనందంగా గడపాలి అనుకున్న ఒక కొత్త పెళ్లికొడుకుకు జూ ప్రదర్శన చేదు అనుభవం లాగా మారింది. బైక్ పార్క్ చేసి వచ్చేలోపు భార్య కనిపించకుండా పోవడం.. ఆమె తన ప్రియుడితో వెళ్లిపోయినట్టు సీసీటీవీలో కనిపించడం.. దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. వివాహానికంటే ముందే ఆమెకు రిలేషన్ ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్లే ఆమె తన ప్రియుడితో పారిపోయినట్టు సమాచారం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper