Homeఆంధ్రప్రదేశ్‌Pattiseema Project: పట్టిసీమ.. 12 ఏళ్ల జల ప్రస్థానం.. 500 టీఎంసీలతో కృష్ణా డెల్టాకు గోదావరి...

Pattiseema Project: పట్టిసీమ.. 12 ఏళ్ల జల ప్రస్థానం.. 500 టీఎంసీలతో కృష్ణా డెల్టాకు గోదావరి జల కళ

Pattiseema Project:సముద్రంలో కలిసిపోయే గోదావరి జలాలను ఒడిసిపట్టి కృష్ణా బేసిన్ కు మళ్లించడం.. కృష్ణ డెల్టా రైతులకు సాగినటి భరోసా కల్పించడం.. శ్రీశైలం జలాలను రాయలసీమ అవసరాలకు వినియోగించుకునే అవకాశాలను పెంచడం.. ఈ లక్ష్యాలతో రూపుదిద్దుకున్నది పట్టిసీమ ఎత్తిపోతల పథకం. ఆంధ్రప్రదేశ్ సాగునీటి చరిత్రలో కీలక ప్రాజెక్టుగా నిలిచింది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు ద్వారా 500 టీఎంసీలకు పై గోదావరి జిల్లాలను కృష్ణ బేసిన్ కు తరలించారు. మొత్తం 103 రోజుల పంపిణీతో ఇంతటి పరిమాణంలో నీటిని […]

Pattiseema Project:సముద్రంలో కలిసిపోయే గోదావరి జలాలను ఒడిసిపట్టి కృష్ణా బేసిన్ కు మళ్లించడం.. కృష్ణ డెల్టా రైతులకు సాగినటి భరోసా కల్పించడం.. శ్రీశైలం జలాలను రాయలసీమ అవసరాలకు వినియోగించుకునే అవకాశాలను పెంచడం.. ఈ లక్ష్యాలతో రూపుదిద్దుకున్నది పట్టిసీమ ఎత్తిపోతల పథకం. ఆంధ్రప్రదేశ్ సాగునీటి చరిత్రలో కీలక ప్రాజెక్టుగా నిలిచింది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు ద్వారా 500 టీఎంసీలకు పై గోదావరి జిల్లాలను కృష్ణ బేసిన్ కు తరలించారు. మొత్తం 103 రోజుల పంపిణీతో ఇంతటి పరిమాణంలో నీటిని తరలించడం ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యతను చాటుతోంది..

సముద్రంలో కలిసే జలాల సద్వినియోగం

గోదావరి నదిలో వరదల సమయంలో సముద్రంలోకి చేరే అదనపు జలాలను వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవాలని ఆలోచనతో పట్టిసీమ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం సుమారు 1651 కోట్లతో ఈ పథకాన్ని నిర్మించింది. . గోదావరి నదిని లిఫ్ట్ చేసి పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణా నదిలోకి తరలించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. కృష్ణా డెల్టాలో సుమారు 13 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు.

వేలాది ఎకరాలకు

కృష్ణానది నీటి లభ్యత తగ్గిపోయిన సందర్భంగా గోదావరి జలాలను తరలించే అవకాశం కృష్ణ డెల్టా సాగుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. వరి.. ఇతర పంటలకు కీలక దశలో నీటి అవసరాలను తీర్చేందుకు ఈ జలాలు దోహదం చేస్తాయి. వర్షపాతం.. నదుల ప్రవాహం సక్రమంగా లేనప్పుడు ఈ నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు.

ప్రస్తుతం ఎల్ నీనో ప్రభావం.. వర్షపాతం తగ్గడం వంటి వాటి వల్ల వ్యవసాయం ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలో ఈ నీటిని లిఫ్ట్ చేయడం ద్వారా ఆయకట్టుకు లాభం చేకూరింది.. పట్టిసీమ ద్వారా కృష్ణ డెల్టాలో వ్యవసాయం.. ఆక్వా రంగం వల్ల దాదాపు లక్ష కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇందులో వ్యవసాయం ద్వారా 26,775 కోట్లు, ఆక్వా రంగం ద్వారా 78,000 కోట్ల సంపద సృష్టి జరిగింది.

పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ కూడా పరోక్షంగా ప్రయోజనం జరుగుతుంది. ప్రతికించి శ్రీశైలం జలాలను పోతిరెడ్డిపాడు.. హంద్రీనీవా ప్రాజెక్టుల ద్వారా రాయలసీమ ప్రాంతాలకు తరలించడానికి ఉపయోగపడుతుంది. సాగు నీటితో పాటు తాగునీటి అవసరాలు.. ప్రాంతీయ అభివృద్ధి.. పరిశ్రమల విస్తరణకు నీటి లభ్యత అత్యంత కీలకం.

పట్టిసీమ నిర్మాణ సమయంలో ఈ ప్రాజెక్టు పై రాజకీయంగా తీవ్రమైన చర్చ జరిగింది. అప్పటి ప్రతిపక్ష వైసిపి నేతలు ఈ ప్రాజెక్టు ఖర్చు.. ఉపయోగంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ తో సహా పలువురు నేతలు ఈ ప్రాజెక్టును ఎగతాళి చేశారు. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణ బేసిన్ కు తరలించడం విశేషం. దీనిని పట్టిసీమ విజంగా టిడిపి నేతలు చెబుతుంటారు. ఇక ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1033 రోజుల పాటు పంపింగ్ చేసి, 500 టిఎంసిల నీటిని ఎత్తిపోశారు.

  • 2015లో 75 రోజులపాటు పంపింగ్ చేశారు. 4.20 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు.
  • 2016లో 134 రోజులు పంపింగ్ చేశారు. 55. 75 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు.
  • 2017లో 161 రోజులపాటు పంపింగ్ చేశారు. 105.80 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు.
  • 2018లో 165 రోజులపాటు నీటిని పంపింగ్ చేశారు. దాదాపు 165 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు.
  • 2019లో 90 రోజులపాటు పంపింగ్ చేశారు. దాదాపు 42.99 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు.
  • 2020లో 64 రోజులపాటు పంపింగ్ చేశారు. దాదాపు 41.54 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు.
  • 2021 లో 16 రోజులపాటు నీటిని పంపింగ్ చేశారు. 1.64 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు.
  • 2022లో పంపింగ్ చేయలేదు. నీళ్లను ఎత్తిపోయలేదు.
  • 2023 లో 119 రోజులపాటు పంపింగ్ చేశారు. 58.72 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు.
  • 2024లో 40 రోజుల పాటు పంపింగ్ చేశారు. 20.62 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు.
  • 2025లో 73 రోజులపాటు నీటిని పంపింగ్ చేశారు. 14.21 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు.

పుష్కరకాలంగా ఏపీ ప్రయోజనాల కోసం పట్టిసీమ పనిచేస్తుంది. తద్వారా పెట్టిన ప్రతీ రూపీకి 60 రెట్ల సంపాదన సృష్టించింది. 1651 కోట్ల రూపాయలతో నిర్మిస్తే.. వ్యవసాయం.. ఆక్వా రంగంలో లక్ష కోట్లకు పైగా సంపద సృష్టి జరిగింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper