Pattiseema Project: గోదావరి వరద జలాలను వృధాగా సముద్రంలో కలవకుండా.. కృష్ణ నదిలోకి మళ్లించాలని నాడు చంద్రబాబు నిర్ణయించారు. నాడు ఆయన ఆలోచనలకు అధికారుల కృషితోడైంది. ఫలితంగా రికార్డు స్థాయిలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణమైంది. నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరువు కాలంలో కృష్ణ డెల్టా రైతులకు సాగు.. తాగునీటి భరోసా కల్పిస్తోంది.
గోదావరి జలాలను సముద్రంలోకి వెళ్లకుండా కృష్ణ బేసిన్ కు మళ్లించి రాష్ట్ర వ్యవసాయ రంగానికి పట్టిసీమ కొత్త ఊపిరి పోసింది. కేవలం 5.5 నెలల రికార్డు సమయంలోనే 1651 కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేసింది. 2015 సెప్టెంబర్ 16న పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను.. కృష్ణానది జలాలతో అనుసంధానం చేసి.. చంద్రబాబు సరికొత్త చరిత్ర సృష్టించారు.
ఈ లిఫ్ట్ స్కీమ్ లో 24 వర్టికల్ టర్బైన్ పంపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా 5300 హెచ్పి సామర్థ్యంతో పనిచేస్తాయి. మొత్తంగా 8500 క్యూసెక్కుల నీటిని కృష్ణ నదికి తరలిస్తాయి. సుమారు 177 కిలోమీటర్ల పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా గోదావరి నీటిని కృష్ణ బేసిన్ కు పట్టిసీమ ద్వారా తరలిస్తున్నారు. కృష్ణ డెల్టాలో సాగునీటి కొరతను అధిగమించి.. రైతులకు నీరు అందించడమే ఈ ఎత్తిపోతల పథకం ప్రధాన లక్ష్యం. పట్టిసీమతో ముందస్తు ఖరీఫ్ సాగు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు తుఫాన్ వల్ల పంట నష్టపోయే ప్రమాదం కూడా తగ్గిపోతుంది. సకాలంలో నీరు అందడం వల్ల కృష్ణ డెల్టాలు రవి పంటలకు కూడా మెరుగైన అవకాశాలు లభిస్తాయి.. కృష్ణా జలాలను ఆదా చేసి రాయలసీమ ప్రాంతాలకు నీటిని మళ్లీంచడానికి పట్టిసీమ కీలకంగా ఉపయోగపడుతుంది..
ఎల్ నినో నేపథ్యంలో సాగునీటి భద్రతకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. రైతుల ఆదాయం పెట్టడానికి దోహదం చేస్తోంది. 2026లో ఎల్ నీనో నేపథ్యంలో పట్టిసీమ ద్వారా కృష్ణ డెల్టాకు 58 టీఎంసీల గోదావరి నీళ్లను అందించారు. కృష్ణ బేసిన్ లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోయినప్పటికీ డెల్టా రైతులకు ఈ లిప్ట్ స్కీమ్ ద్వారా నీటి భరోసా లభించింది. పట్టిసీమ లేకపోయి ఉంటే ఈ ఏడాది కృష్ణా రైతులు తీవ్రమైన సాగునీటి సంక్షేపాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఎల్ నినో వంటి కరువు పరిస్థితుల్లోనూ రైతులకు అండగా నిలిచిన సంజీవని పట్టిసీమ ఎత్తిపోతల పథకం. 2015 నుంచి ఇప్పటివరకు 500 టిఎంసిల నీళ్లను కృష్ణ బేసిన్ కు తరలించారు. పట్టిసీమ ద్వారా వ్యవసాయం.. ఆక్వాకల్చర్ రంగాలకు నీటి భద్రతను కల్పించారు.. వ్యవసాయం.. ఆక్వాకల్చర్ రంగాల ద్వారా 1,04,775 కోట్ల సంపద సృష్టించారు. పట్టిసీమ కేవలం ఒక ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు.. లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను కాపాడే దూర దృష్టితో నిర్మించిన ప్రాజెక్టు.
రామానాయుడు ఏమన్నారు అంటే
పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ సంజీవనీలాగా అభివర్ణించారు నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు. “నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. రైతుల సంక్షేమం.. సాగునీటి భద్రత.. రాష్ట్ర సస్యశ్యామలతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ అసెంబ్లీ సాక్షిగా పట్టిసీమ దండగా.. పట్టిసీమ కాదు. వట్టిసీమ.. డబ్బులు వృధా అన్నారు.. జగన్ పరిపాలన కాలంలో 2022 మిగతా నాలుగు ఏళ్ళు కరువు రాజ్యమేలుంది. పట్టిసీమ పంపులు ఆన్ చేయక తప్పలేదు. 2021లో అత్యధికంగా 165 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసి కృష్ణ డెల్టాకు నీరు అందించారు. 1651 కోట్లతో నిర్మించిన పట్టిసీమ నేడు కృష్ణ డెల్టాకు 500 టీఎంసీల నీళ్లను అందించింది. ఒక లక్షా నాలుగు వేల కోట్ల ఆదాయాన్ని సృష్టించింది. దూర దృష్టి, ముందుచూపు.. నిర్మాణాత్మక ఆలోచన కలిగిన నాయకుడు ఉంటే ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో ఈ లిఫ్ట్ స్కీమ్ ఒక ఉదాహరణ. పరిపాలన అనుభవం లేకపోవడం.. విధ్వంసపు ఆలోచనలు.. ముందు చూపు లేకపోవడం వల్లే జగన్ పట్టిసీమ వైపు ఇంతవరకు కన్నెత్తి చూడలేదు. ఆల్మట్టి నుంచి జూరాల.. తుంగభద్ర.. శ్రీశైలం.. నాగార్జునసాగర్ వరకు ఖాళీ జలాశయాలతో ఉన్న కృష్ణాకు పట్టిసీమ ఊపిరి పోస్తోంది. కృష్ణ డెల్టాకు పట్టిసీమ నేర్ ఇవ్వడం ద్వారా శ్రీశైలం నీటిని రాయలసీమ సాగు తాగునీటి అవసరాలకు ఇవ్వగలిగాం. సీఎం సూచనలతో తీవ్రమైన కరువును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాం. ప్రతి నీటిబొట్టును సమర్థవంతంగా వినియోగించుకుంటున్నామని” ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.