Bigg Boss 10 Telugu: ఈ బిగ్ బాస్ సీజన్ ఎంత ఫైర్ మీద రన్ అవుతుందో కళ్లారా చూస్తూనే ఉన్నాం. ప్రతీ వారం బిగ్ బాస్ టీం ఇచ్చే ట్విస్టులకు ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ రేంజ్ ట్విస్టులు బిగ్ బాస్ హిస్టరీ లో ఇప్పటి వరకు లేవనే చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే నేడు బిగ్ బాస్ హౌస్ లోకి 5 మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వాళ్ళు ఎవరు ?, వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? , వీళ్ళు వచ్చిన తర్వాత హౌస్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
1) శివ్ కుమార్ :
ఈయన స్టార్ మా ఛానల్ లో పాపులర్ సీరియల్ హీరో. ఇప్పటి వరకు ఈయన చేసిన సీరియల్స్ లో ‘కోయిలమ్మ’ చాలా పెద్ద హిట్ అయ్యింది. అందులో హీరోయిన్ గా నటించిన ప్రియాంక జైన్ తో ప్రస్తుతం ప్రేమలో ఉన్నాడు. వీళ్లిద్దరు కలిసి యూట్యూబ్ , ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసే వీడియోలు ఒక రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. గత సీజన్ లోనే శివ్ కి ‘బిగ్ బాస్’ ఆఫర్ వచ్చింది. కానీ అప్పుడు ఆయన ‘నిన్ను కోరి’ సీరియల్ లో చేస్తూ బిజీ గా ఉండడం తో రాలేకపోయాడు. ఈ సీజన్ ఆరంభం లోనే రావాల్సింది, కానీ కుదర్లేదు. ఈ ఏడాది ఈయన తన ప్రియురాలు ప్రియాంక జైన్ తో కలిసి ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ షో లో పాల్గొన్నాడు. ఈ షో లో శివ్ చాలా అద్భుతంగా గేమ్ ఆడాడు. టాస్కులు ఆడుతున్న సమయంలోనే ఆయన కాళ్లకు దెబ్బ తగలడం తో నాల్గవ వారం లో సెల్ఫ్ ఎవిక్ట్ అవ్వాల్సి వచ్చింది. మరి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత శివ్ అదే రేంజ్ ఫైర్ చూపిస్తాడో లేదో చూడాలి.
2) రామకృష్ణ :
అగ్నిపరీక్ష 2 ద్వారా మంచి క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న రామకృష్ణ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుండో చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘అగ్ని పరీక్ష 2’ సమయం లో ఇతనికి రోహిత్ తో సమానమైన ఓటింగ్ పాడేది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కచ్చితంగా రోహిత్ కి పోటీ ఇవ్వగలడు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి మూడవ వారం లోనే రామకృష్ణ కి అపూర్వ , మితిలేష్ లతో సమానంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశాలు ఇచ్చారు బిగ్ బాస్ టీం. కానీ దురదృష్టం కొద్దీ మితిలేష్ తో జరిగిన టాస్క్ లో ఓడిపోవడం వల్ల రాలేకపోయాడు. కానీ అతనికి జనాల్లో ఉన్నటువంటి విపరీతమైన ఆదరణ కారణంగా ఒక్క అవకాశం ఇస్తున్నారు బిగ్ బాస్ టీం.
3)నీతూ మాస్టర్:
ఈమె ప్రముఖ కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ సతీమణి అనే విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరు కలిసి ఎన్నో టీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ లో కనిపించారు. ఈ ఏడాది ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ గేమ్ షో లో కూడా పాల్గొన్నారు. టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచారు. ఆ షో లో ఈమె అగ్రెషన్ , గేమ్స్ ఆడిన తీరుని చూసినప్పుడు , కచ్చితంగా ఈమె బిగ్ బాస్ హౌస్ కి పనికొస్తాడని అంతా అనుకున్నారు. అనుకున్నట్టు గానే ఆమె ‘బిగ్ బాస్ 10’ లోకి వైల్డ్ కార్డు గా నేడు రాబోతుంది. మరి హౌస్ లోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ని తట్టుకొని ఈమె కొనసాగగలదా లేదా అనేది చూడాలి. మరోపక్క ఈమె బిగ్ బాస్ 9 రన్నర్ తనూజ కి ఫ్యామిలీ ఫ్రెండ్ , ఆమె అభిమానులు ఈమెకు అండగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
4) శ్వేతా నాయుడు :
సోషల్ మీడియా లో పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ డ్యాన్స్ రియాలిటీ షోస్ లో కనిపించింది. యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది , మంచి ఫైర్ బ్రాండ్ కూడా , ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే బెస్ట్ లేడీ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి , అదే సమయం లో టాప్ 5 లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి , చూడాలి మరి ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇవ్వబోతుంది అనేది.
5) దక్షి :
దక్షి కూడా సోషల్ మీడియా లో మంచి పాపులర్. టీవీ షోస్ లో , మూవీస్ లో ఇప్పటి వరకు కనిపించలేదు కానీ , రీసెంట్ గానే జియో హాట్ స్టార్ లో ‘పార్ట్ టైమర్స్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ లో ‘బిగ్ బాస్ 9’ రన్నర్ తనూజ పుట్టసామీ కూడా లీడ్ రోల్ చేసింది. ఈ సిరీస్ తో మంచి ఫేమ్ సొంతం చేసుకున్న దక్షి , బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత తన మార్కు పెర్ఫార్మన్స్ ని చూపిస్తుందో లేదో చూడాలి.