Chandrababu Naidu: ఏపీ రాజకీయాలలో కీలక ఘట్టం. సమాజంలో పెద్ద వర్గాలుగా ఉన్న బీసీలకు కీలక స్థానం లభించబోతోంది. ఒకరకంగా చెప్పాలంటే అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. జగన్ కుట్రలను తిప్పికొట్టింది. చారిత్రాత్మక నిర్ణయానికి ప్రభుత్వం సిద్ధమైంది. బడుగు బలహీన వర్గాల కు రాజ్యాధికారం అందించేందుకు.. వారికి మరింత సుస్థిరతను ఇచ్చేందుకు ప్రభుత్వం సమగ్ర అధ్యయనం కోసం వన్ మ్యాన్ డెడికేషన్ కమిషన్ ను నియమించింది.
వన్ మ్యాన్ డెడికేషన్ కమిషన్ నివేదిక మంత్రివర్గ సమావేశం ముందుకు వచ్చింది. ఈ నివేదికకు కేబినెట్ ఆమోదముద్ర కూడా వేసింది. తద్వారా లోకల్ బాడీ ఎలక్షన్లలో బీసీలకు సింహభాగం సీట్లు వస్తాయి. సుప్రీంకోర్టులో అనుకూలమైన తీర్పు రాకపోయినప్పటికీ పార్టీపరంగా 34% వాటా బీసీలకు కేటాయిస్తున్నట్లు ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో వన్ మ్యాన్ డెడికేషన్ కమిషన్ విస్తృతంగా పర్యటించింది. సమగ్ర సామాజిక.. ఆర్థిక.. రాజకీయ సమాచారం ఆధారంగా ఈ నివేదికను వన్ మ్యాన్ కమిషన్ పక్కాగా రూపొందించింది. గతంలో రిజర్వేషన్ల కేటాయింపులో అనేక రకాలుగా న్యాయపరమైన చిక్కులు వచ్చాయి. వాటిని అధిగమించి.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఈ సిఫారసులను తయారు చేశారు. దీనివల్ల చట్టపరమైన సమస్యలు ఎదురు కాకుండా బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం.. న్యాయం జరిగే విధంగా చంద్రబాబు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లారు.
కొన్ని రోజులుగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు అంశంలో వైసిపి విపరీతమైన కుట్రలు చేసింది. తప్పుడు ప్రచారాలు చేసింది. సొంత మీడియాలో అడ్డగోలుగా కూతలు కూసింది. చంద్రబాబు ప్రభుత్వం ఒకవైపు బడుగు బలహీన వర్గాలకు అండదండగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. వైసిపి విష ప్రచారం చేసింది. చివరికి సుప్రీంకోర్టులో అనుకూలమైన ఫలితాలు రాకపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీపరంగా వెనుకబడిన కులాల వారికి తోడ్పాటు ఇస్తామని ప్రకటించారు. వైసీపీ నేతలు కోర్టులలో వేసిన పిటిషన్లను.. అనవసరమైన వివాదాలను చంద్రబాబు తన చతురతతో తొక్కి వేశారు. బీసీలకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా 34 శాతం కోటా ను పార్టీ పరంగా ఇస్తున్నట్టు ప్రకటించడంతో బడుగు బలహీన వర్గాలలో ఆనందం తాండవిస్తోంది.
గత ప్రభుత్వం బీసీలకు అడుగడుగునా అన్యాయం చేసింది. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగుల అభ్యున్నతికి బాటలు వేస్తున్నారు. బీసీలలో ఉన్న అన్ని కులాలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం మొదలుపెట్టారు. వెనుకబడిన కులాలకు వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తున్నారు. తద్వారా వారి జీవితాలలో కొత్త వెలుగులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏకంగా రాజ్యాధికారాన్ని కూడా ప్రాప్తించేలా చేస్తున్నారు. తద్వారా బీసీలకు ఆరాధ్య నాయకుడిగా.. చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోనున్నారు.