Anchor Shyamala: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బోరుగడ్డ అనిల్ కుమార్ పరిస్థితి ఎలా తయారయ్యిందో అర్థం చేసుకోవచ్చు. జగనన్న కోసం ఎంతటి వాడినైనా ఎదిరిస్తాను అన్నట్టు ఉండేది అనిల్ కుమార్ మాటలు. అదే జగనన్న పార్టీ కార్యాలయంలోకి ఎంట్రీ లేకుండా పోయింది బోరుగడ్డ అనిల్ కుమార్ కు. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతాపం చూపుతారు. ఎవరి పాత్ర ఎంతవరకు అన్నది ఆయన ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఆయన చూపు పార్టీ అధికార ప్రతినిధి శ్యామలపై పడింది. ఆమెకు ప్రస్తుతం ప్రాధాన్యత తగ్గింది. మొన్న మధ్యన కార్యాలయంలోకి కూడా రానివ్వలేదన్న టాక్ నడిచింది. ఇప్పుడు మాట్లాడించినట్టే.. మళ్లీ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
* ఆమె పాత్ర పై కోత..
యాంకర్ శ్యామల మాట్లాడితే పెద్ద విషయం ఉండదు. పెద్ద సీరియస్ గా కూడా అనిపించదు. అందుకే ఆమె పాత్రపై కోత తప్పడం లేదని తెలుస్తోంది. అయితే అంతగా గుర్తింపు లేని నాగ మల్లేశ్వరి అనే మహిళ నేతను ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారు. ఆమెతో ఇప్పుడు ప్రెస్మీట్లో పెట్టిస్తున్నారు. ఇది శ్యామలకు పొమ్మనలేక పొగ పెట్టడమే. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ఒక వివాదాస్పద నటి ఇప్పుడు శ్యామలపై ఆరోపణలు చేస్తున్నారు. ఆమె గతాన్ని తవ్వుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
* ప్రెస్మీట్లు లేకుండా…
ప్రస్తుతం వైసీపీలో పరిస్థితులు చూస్తుంటే మాత్రం శ్యామలకు ప్రాధాన్యం తగ్గినట్టే అన్నట్టు ఉంది. పొమ్మన్న లేక పొగ పెడుతున్నారు అని అర్థం అవుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న పరిణామాలు.. సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న ప్రచారాలు చూస్తుంటే ఆమెను క్రమంగా మూలన పడేసినట్టే అని స్పష్టమవుతోంది. అయితే గతంలో వైసిపి కోసం పనిచేసిన చాలామంది పరిస్థితి ఇలానే ఉంది. బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే తన భార్యతో తాడేపల్లి కార్యాలయం బయట ధర్నా చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు అక్కున చేర్చుకొని మరి వారిని ప్రోత్సహించారు. ఇప్పుడు కార్యాలయంలోపలికి ప్రవేశం లేదు వారికి. కనీసం మాట సాయం లేదు కూడా. ఇప్పుడు అదే జాబితాలోకి యాంకర్ శ్యామల కూడా చేరడం విశేషం.
View this post on Instagram