Sadiq Controversy: రాష్ట్రంలో ఏ పరిణామాలు జరిగినా అవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకుంటున్నాయి. చివరకు కుటుంబ, వైవాహిక వివాదాలు సైతం వైసీపీకి చెడ్డపేరు తీసుకొస్తున్నాయి. తాజాగా కాకినాడలో ఓ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన లవ్ జిహాద్ వివాదంలో కూడా వైసిపి నేత పేరు వినిపిస్తోంది. మతమార్పిడి ఒత్తిడితో పాటు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు దిగుతూ నూకరాజు అనే అధికారి కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సాదిక్.. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నడుస్తోంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో సాదిక్ దిగిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా ఏపీని కుదిపేస్తోంది ఆ కుటుంబ ఆత్మార్పణం. అయితే దీనిపై జనసేన ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్ కూడా స్పందించారు. ఆ బాధ్యత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ను కోరారు. దీనిపై పెద్ద రాకెట్ నడుస్తోందని ఆరోపణలు చేశారు.
* ఎమ్మెల్యేతో ఇనిస్ట్యూట్ ప్రారంభం..
అటు తిరిగి ఇటు తిరిగి ఈ వివాదం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళింది. సాదిక్ రైఫిల్ ఇన్స్టిట్యూట్ నడిపే క్రమంలోనే ఇలా మతమార్పిడి పై ఒత్తిడి లు చేసేవారని.. హిందూ మహిళలను టార్గెట్ చేసి ట్రాప్ లోకి దించేవారని ఆరోపణలు వస్తున్నాయి. ఇంకోవైపు ఈ ఘటనను ముస్లిం మైనారిటీ సంఘాల ప్రతినిధులు ఖండించారు. సాదిక్ లాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రధానంగా సాదిక్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరుడు అని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. వైసిపి హయాంలోనే రెచ్చిపోయేవాడని టాక్ నడుస్తోంది.
* వ్యక్తిగత వ్యవహారాలతో..
ప్రధానంగా తన పేరు బయటకు రావడంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. తనకు సాధిక్ తో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. రైఫిల్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడంతో.. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనను ప్రారంభించేందుకు ఆహ్వానించారని.. వైసీపీకి చెందిన ఓ మైనారిటీ నేత ద్వారా తనకు ఆహ్వానం అందిందని.. అంతకుమించి తనకు సాధిక్ తో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయితే వైసీపీలో మాత్రం ఒక ఆందోళన కనిపిస్తోంది. ఎక్కడ ఏ కుటుంబ, వ్యక్తిగత వివాదాలు సైతం పార్టీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కొందరు నేతలు. మాజీ మంత్రి జోగి రమేష్ విషయంలో జగన్ అసహనంతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు ద్వారంపూడి వ్యవహారం వెలుగులోకి రావడంతో ఎలా స్పందిస్తారో చూడాలి.
View this post on Instagram