Homeవింతలు-విశేషాలుMosquito Malaria: ఆఫ్ట్రాల్ దోమ కాదు.. ఇది రాజమౌళి సినిమాలో ఈగ లాంటిది.. విమానంలో వచ్చి...

Mosquito Malaria: ఆఫ్ట్రాల్ దోమ కాదు.. ఇది రాజమౌళి సినిమాలో ఈగ లాంటిది.. విమానంలో వచ్చి మరీ చంపేసింది..

Mosquito Malaria: ఈగ సినిమా చూశారా.. అందులో ఈగ విలన్ సుదీప్ ను చంపేస్తుంది. అతనిని చంపడానికి అనేక రకాలుగా మార్గాలు అన్వేషిస్తుంది. చివరికి తన ప్రాణం పోతున్నా సరే.. తనను చంపిన సుదీప్ ను అంతం చేస్తుంది. మనుషులకే కాదు ఈగలకు కూడా పగ ఉంటుందని ఆ సినిమా ద్వారా రాజమౌళి చూపించారు. రాజమౌళి చూపించింది కేవలం ఈగను మాత్రమే.. కానీ తాను అంతకంటే ఎక్కువ అని ఈ దోమ నిరూపించింది. అంతేకాదు ఈగ స్థాయిని […]

Mosquito Malaria: ఈగ సినిమా చూశారా.. అందులో ఈగ విలన్ సుదీప్ ను చంపేస్తుంది. అతనిని చంపడానికి అనేక రకాలుగా మార్గాలు అన్వేషిస్తుంది. చివరికి తన ప్రాణం పోతున్నా సరే.. తనను చంపిన సుదీప్ ను అంతం చేస్తుంది. మనుషులకే కాదు ఈగలకు కూడా పగ ఉంటుందని ఆ సినిమా ద్వారా రాజమౌళి చూపించారు.

రాజమౌళి చూపించింది కేవలం ఈగను మాత్రమే.. కానీ తాను అంతకంటే ఎక్కువ అని ఈ దోమ నిరూపించింది. అంతేకాదు ఈగ స్థాయిని మించి పగను పెంచుకొని ఒక మనిషిని అంతం చేసింది. రాజమౌళి ఈగ జస్ట్ సినిమా మాత్రమేనని.. తాను నూటికి నూరు శాతం రియల్ అని ఈ దోమ నిరూపించింది.. దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి.

యూరప్ లోని ప్రసిద్ధమైన జర్మనీ దేశంలో ఫ్రాంక్ ఫర్డ్ అనే సంస్థ ఎయిర్ సర్వీస్ అందిస్తూ ఉంటుంది.. ఈ సంస్థలో ఇటీవల ఆరుగురు సిబ్బంది మలేరియా జ్వరం బారిన పడ్డారు.. ఇందులో ఒకరు కన్నుమూశారు. మలేరియా ప్రభావిత ప్రాంతం నుంచి విమానంలో వచ్చిన దోమలే ఈ దారుణానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దోమల కోసం ట్రాప్ లు ఏర్పాటు చేశారు. అవి పట్టుబడిన అనంతరం వాటి జాతి.. అవి ఎక్కడి నుంచి వచ్చాయో విశ్లేషించబోతున్నారు. జర్మనీలో దోమలు ఉన్నప్పటికీ.. అక్కడి తక్కువ ఉష్ణోగ్రత వల్ల దోమలు అంతగా వ్యాప్తి చెందవు. అంతేకాదు మలేరియా లాంటి వ్యాధులను కూడా వ్యాపింప చేయలేవు.

విమానంలో ప్రయాణించి మరీ ఆ మనిషిని చంపేశాయంటే ఆ దోమలు ఏ స్థాయిలో పగపించుకున్నారో అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే వైద్యశాస్త్రం ప్రకారం దోమలకు పగ అనేది ఉండదు. అవి కేవలం రక్తాన్ని పీల్చడానికి మాత్రమే కుడుతుంటాయి. వైరస్లకు.. బ్యాక్టీరియాలకు అవి వాహకాలుగా పనిచేస్తూ ఉంటాయి. అందువల్లే ఇటువంటి రోగాలు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. సాధ్యమైనంతవరకు దోమలను నివారించడమే ఉత్తమమైన మార్గం. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. సాధ్యమైనంత వరకు దోమలు వ్యాప్తి చెందే ప్రాంతానికి వెళ్లకుండా ఉండాలి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే సరైన స్థాయిలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అప్పుడే మలేరియా లాంటి వ్యాధులు సోకకుండా ఉంటాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper