Srikanth: టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ సపోర్టు లేకుండా , ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని మొదలు పెట్టి , వంద సినిమాలకు పైగా హీరో గా నటించి , ఫ్యామిలీ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న నటుడు శ్రీకాంత్. అయితే హీరో గా కెరీర్ ముగిసిన తర్వాత , క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి , ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఎంత బిజీ కెరీర్ ని కొనసాగిస్తున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. అయితే ఇంతకాలం కేవలం వెండితెర మీద మాత్రమే అలరిస్తూ వచ్చిన శ్రీకాంత్, తొలిసారి జీ తెలుగు ఛానల్ లో ‘డ్రామా జూనియర్స్ 9’ ప్రోగ్రాం లో జడ్జీ గా కనిపించాడు. ఈ షో గ్రాండ్ ఫినాలే రీసెంట్ గానే ముగిసిన సంగతి తెలిసిందే.
ఈ షోకి హోస్ట్ గా సుడిగాలి సుధీర్ వ్యవహరించగా, శ్రీకాంత్ తో పాటు అనిల్ రావిపూడి , రోజా జడ్జీలుగా వ్యవహరించారు. ఈ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి శ్రీకాంత్ సతీమణి ఊహా స్పెషల్ గెస్ట్ గా విచ్చేసింది. ఆమెతో సుధీర్ కాసేపు సంబాషించగా , శ్రీకాంత్ కి ఇంత మతిమరుపు ఉందా అనే విషయం బయటపడింది. సుధీర్ ఊహా ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఇంట్లో శ్రీకాంత్ గారు ఇంతేనా అండీ, పేర్లు మర్చిపోతూ ఉంటాడా?’ అని అడగ్గా , అందుకు ఊహా ‘అవును’ అని సమాధానం చెప్తుంది. అప్పుడప్పుడు రోషన్ ని రోహన్ అని, రోహన్ ని రోషన్ అని పిలుస్తుంటాను అని శ్రీకాంత్ చెప్పుకొస్తాడు. ఆ పేర్లు ఎప్పుడూ నన్ను తికమక పెడుతూనే ఉంటాయని ఈ సందర్భంగా శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. అప్పుడప్పుడు నా భార్య ఊహా ని ఉమా అని కూడా పిలుస్తుంటాడు అట శ్రీకాంత్.
శ్రీకాంత్ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. శ్రీకాంత్ కి ఏర్పడిన సందర్భమే మీ జీవితాల్లో కూడా ఎదో ఒక సందర్భం లో ఎదురు అయ్యే ఉంటుంది, మీకు ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు , ఒకే తరహా పేర్లు పెట్టినప్పుడు, ఒకరిని మరొకరి పేరుతో పిలిచిన సందర్భాలు ఉండే ఉంటాయి అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.