Actor Srikanth bail: తమిళం లో రీసెంట్ మాలకద్రవ్యాల వాడకం కేసు ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ కేసు లో చిక్కుకున్నారు. వారిలో ప్రముఖ నటుడు శ్రీకాంత్(Actor Srikanth) కూడా ఉన్నాడు. శ్రీకాంత్ అంటే మన టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కాదు, ‘రోజా పూలు’ మూవీ హీరో శ్రీకాంత్. తెలుగు, తమిళ భాషల్లో ఈయన ఇప్పటికీ హీరో గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే ఉన్నాడు. రీసెంట్ గానే శ్రీకాంత్ ని ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి వివిధ రకాల ప్రశ్నలతో విచారణ జరిపారు. ఈయనతో పాటు కృష్ణ అనే మరో నటుడు కూడా అరెస్ట్ అయ్యాడు. ఇన్ని రోజులు వీళ్లిద్దరు కస్టడీ లోనే ఉన్నారు. నేడు వీళ్లిద్దరికీ మద్రాసు హై కోర్టు షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: టాలీవుడ్ సెలబ్రిటీలపై ఈడీ కొరడా..రానా,విజయ దేవరకొండ లతో పాటు 29 మందిపై కేసు నమోదు!
వీళ్లిద్దరి వ్యక్తిగత బెయిల్ పిటీషన్ విచారణ నిన్న మద్రాసు హైకోర్టు(High Court) లో జరిగింది. అయితే ఈ కేసు లో వీళ్లిద్దరికీ పూర్తి స్థాయి రిలీఫ్ మాత్రం దొరకలేదు. ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. జూన్ 23 న శ్రీకాంత్ ని చెన్నై లోని నంగనల్లూరు ప్రాంత పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతన్ని అరెస్ట్ చేసిన వారం రోజుల తర్వాత నటుడు కృష్ణ ని ,అలాగే ఆయన సహచరుడిని కూడా అరెస్ట్ చేశారు. మలకద్రవ్యాలు సేవించడమే కాకుండా, పలు ప్రైవేట్ పబ్బులలో విక్రయించినట్టు సాక్ష్యాధారాలు ఉండడం తో పోలీసులు అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇది చిన్న నెట్వర్క్ కాదు, చాలా పెద్ద నెట్వర్క్. పలువురు రాజకీయ నాయకులూ కూడా ఇందులో ఉన్నారు. అయితే ప్రస్తుతానికి వాళ్లకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు బయటకు రాలేదు కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళ పేర్లు బయటకు రాలేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ కేసు శ్రీకాంత్ ని కేంద్రంగా చేసుకొని ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది.
Also Read: ఈ ఏడాదిలోనే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’..సెన్సేషనల్ డేట్ ని లాక్ చేసిన మేకర్స్!
ఈ ఏడాది శ్రీకాంత్ నుండి తమిళం లో రెండు సినిమాలు విడుదల అయ్యాయి. తెలుగు లో ఆయన రీసెంట్ గా ఎర్రచీర అనే చిత్రం లో నటించాడు. 2023 వ సంవత్సరం లో ఈయన హీరో గా నటించిన పిండం అనే చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి. ఓటీటీ లో కూడా పెద్ద హిట్ అయ్యింది. ఏడాదికి కనీసం నాలుగైదు సినిమాల చేస్తూ వచ్చే శ్రీకాంత్ కి ఈ మాలాకద్రవ్యాల కేసు ఎఫెక్ట్ కెరీర్ మీద పడుతుందో లేదో చూడాలి.