Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన ‘టాక్సిక్’ చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత హీరో యాష్ నుండి రాబోతున్న సినిమా ఇది. చాలా గ్యాప్ రావడంతో ఆయన అభిమానులు ఈ సినిమా కోసం పడిగాపులు కాచారు. ముందుగా మార్చి 19 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు పెట్టారు. కానీ జూన్ నెలకు షిఫ్ట్ చేశారు. అప్పటికీ కూడా విడుదల కాలేదు. చివరికి ఈ నెల 26 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఈ సినిమా ని కేవలం పాన్ ఇండియా లెవెల్ లో మాత్రమే కాదు , పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అన్ని ఫారిన్ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని అనువదించారు. ‘వారణాసి’ చిత్రం మొట్టమొదటి అంతర్జాతీయ సినిమా అవుతుందని అంతా అనుకున్నారు కానీ , దానికంటే ముందే ‘టాక్సిక్’ చిత్రం అంతర్జాతీయ లెవెల్ లో విడుదల కాబోతుంది. అయితే ఒకప్పటి కంటే , ఈ చిత్రానికి ఇప్పుడే ఎక్కువ క్రేజ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈమధ్య కాలం లో ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ , ట్రైలర్ , పాటలు అన్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా ట్రైలర్ ని చూసినప్పుడు హాలీవుడ్ సినిమాని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. మరి ఆ స్థాయి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అనేది మరో మూడు రోజుల్లో తెలియనుంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని ఓవర్సీస్ లో ప్రత్యేకంగా రీసెంట్ గానే కొంతమంది ప్రముఖులకు , మీడియా మిత్రులకు వేసి చూపించారట. వారి నుండి వస్తున్న రెస్పాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమాని చూసిన వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే , ఇలాంటి బోల్డ్ యాక్షన్ మూవీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పటి వరకు రాలేదని , సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే , చివరి 30 నిమిషాలు మరో ఎత్తు అని , సినిమాని నిలిపింది ఆ 30 నిమిషాలే అని అంటున్నారు. ట్రైలర్ ని చూసిన తర్వాత ఈ చిత్రం లో యాష్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. తండ్రి కొడుకులు గా ఆయన నటించాడు. వీళ్లిద్దరి మధ్య జరిగే సంఘటనలు చివరి 30 నిమిషాల్లో ఆడియన్స్ ని కట్టిపారేస్తుందట. ఒకవేళ అదే నిజమైతే , ఈ సినిమా అవలీలగా 1000 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.