DC Movie: పాన్ ఇండియా లెవెల్ లో టాప్ 3 స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన లోకేష్ కనకరాజ్ , తొలిసారి హీరో గా మారి నటించిన చిత్రం ‘డీసీ’. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వామిక గబ్బీ హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ టాక్ కి తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి. బయ్యర్స్ కి పెట్టిన ప్రతీ పైసాకు నాలుగింతల లాభాలు వచ్చాయి. ఓవరాల్ గా 17 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ వసూళ్లకు అతి చేరువలో ఉంది. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచినటువంటి వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ చిత్రానికి 21 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక తమిళనాడు లో అయితే దాదాపుగా 23 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా కర్ణాటక రాష్ట్రం నుండి 9 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి కేరళ నుండి 19 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల 50 లక్షలు , ఓవర్సీస్ నుండి 24 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 100 కోట్ల గ్రాస్ వసూళ్లకు అతి చేరువగా వచ్చిన ఈ చిత్రానికి 46 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కేవలం 20 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రానికి , దాదాపుగా 26 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి. హీరో గా మొదటి సినిమాతోనే ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ ని అందుకోవడం అనేది మామూలు విషయం కాదు.
ఇక ఈ సినిమా ఓటీటీ విడుదల పై ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ చిత్రాన్ని సన్ నెట్వర్క్స్ సంస్థ నిర్మించింది కాబట్టి , ‘సన్ NXT’ లోనే విడుదల చేయబోతున్నారు అట. సెప్టెంబర్ 11 లేదా సెప్టెంబర్ 18 న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. తెలుగు , తమిళం తో పాటు హిందీ , కన్నడ , మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. మరి థియేటర్స్ లో ఆ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి , ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.