Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’ ఈ నెల 26 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతున్న సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా , నిన్న మల్లా రెడ్డి కాలేజీ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వేల సంఖ్యలో అభిమానులు తరళి వచ్చారు. హీరో యాష్ అభిమానులను ఉద్దేశించి , వాళ్ళ కెరీర్స్ బాగుండాలంటూ , మొదటి 7 నిమిషాలు , కేవలం వాళ్ళ కోసమే కేటాయించారు. సినిమా హీరోల కోసం ఎక్కువ సమయాన్ని వృధా చేసుకోకండి , మేము పెద్దగా మీకు ఏమి చెయ్యలేదు అంటూ ఆయన మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. దాదాపుగా 24 నిమిషాలు ఆయన ప్రసంగిస్తే , ఎక్కువ శాతం తెలుగు లోనే మాట్లాడడం విశేషం.
ఎన్నో ఏళ్ళ నుండి మనం కొంత మంది తమిళ హీరోలను ఆదరిస్తున్నాము. వాళ్లలో చాలామందికి ఇప్పటికీ తెలుగు రాదు. ఉదాహరణకు సూర్య నే తీసుకుందాం. తెలుగు ప్రేక్షకులు ఇతని పై ఎలాంటి అభిమానం చూపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఇప్పటి వరకు ఆయన తెలుగు నేర్చుకోలేదు , కనీసం ప్రయత్నం కూడా చెయ్యలేదు. కానీ యాష్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం గా స్వచ్ఛమైన తెలుగు లో మాట్లాడాడు. ఒక్క కన్నడ హీరో అయ్యుండి , తెలుగు కి గౌరవం ఇస్తూ ఆయన మాట్లాడిన ప్రతీ మాట అభిమానుల మనసుల్లోకి దూసుకెళ్లింది. యాష్ పై మరింత గౌరవం , అభిమానం పెంచేలా చేశాయి. అయితే ఆయన ప్రసంగం ఇస్తున్న సమయం లో దురదృష్టం కొద్దీ ఒక ప్రమాదం జరిగింది. యాష్ ని చూసేందుకు ఆడియో బాక్సులు అమర్చిన టవర్స్ ని ఎక్కారు అభిమానులు.
అవి ఒక్కసారిగా కుప్పకూలిపోవడం తో అభిమానులు పడిపోయారు. ఇద్దరికీ తీవ్రమైన గాయాలు అవ్వడంతో వెంటనే హాస్పిటల్ కి తరళించారు. ఈ సంఘటన జరగడం తో యాష్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి , ఎలా ఉన్నారు , జాగ్రత్త గా చూసుకోండి అంటూ సిబ్బందికి చెప్పడం , ఆ తర్వాత టవర్స్ ఎక్కిన అభిమానులను క్రిందకు దిగండి అని బ్రతిమిలాడడం, నెటిజెన్స్ కి యాష్ పై మరింత గౌరవం పెంచేలా చేసింది. సోషల్ మీడియా లో సంచలనం రేపుతున్న ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.