Systematic Investment Plan: నేటి కాలంలో డబ్బు సంపాదించేవారు చాలామంది ఉన్నారు. కానీ ఆ డబ్బును రెట్టింపు చేయాలనుకునే వారు కొంతమంది కనిపిస్తున్నారు. చాలామంది తమకు వచ్చిన ఆదాయాన్ని సరైన ప్రణాళిక లేకుండా ఖర్చు చేయడం వల్ల అత్యవసరానికి డబ్బులు సరిపోవడం లేదు. అంతేకాకుండా కొన్ని రోజుల తర్వాత ఎంత సంపాదించాం? అని చూస్తే ఏమి కనిపించదు. ఇలాంటి అప్పుడు ఒక క్రమ పద్ధతిలో డబ్బును సేవ్ చేసుకుంటూ వెళ్తే.. భవిష్యత్తు అవసరాలతో పాటు ప్రస్తుతం ఎన్నో రకాల ఖర్చులకు కూడా వెచ్చించే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. అలాంటి ప్లాన్లు ఏమున్నాయో చూద్దాం..
సాధారణంగా జీతంపై పని చేసేవారు తమకు వచ్చిన ఆదాయాన్ని మొత్తం.. ఖర్చు పెట్టేస్తుంటారు. ఇందులో కొంత భాగం డిపాజిట్ చేయాలని అనుకుంటారు. కానీ ఇలా డిపాజిట్ కాకుండా System Investment Plan (SIP) ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో అత్యధిక రాబడి వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఉదాహరణకు ఒక వ్యక్తికి నెలకు వచ్చే జీవితంలో రూ.5000ను SIP చేసుకుంటూ వెళ్తే.. 25 సంవత్సరాల వరకు సాధారణంగా 12% వడ్డీ అనుకుంటే.. రూ. ఒక కోటి 9 లక్షలు రిటర్న్ వస్తాయి. అయితే ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది కేవలం రూ. 15 లక్షలు మాత్రమే. మిగతా 94 లక్షలు వడ్డీ రూపంలో వస్తాయి. అయితే ఇంత డబ్బు కేవలం 5 ఏళ్లలోనే సంపాదించే మార్గం ఉంటుంది. అదేంటంటే?
ప్రతి నెల రూ.5000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్లాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం అదనంగా రూ.1000 పెట్టుబడిని పెంచుకుంటూ పోవాలి. ఇలా ఐదేళ్లపాటు పెంచుకుంటూ పోతే.. ఆ తర్వాత కోటికి పైగానే రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్లో ఉండే ఒడిదుడుకుల కారణంగా వడ్డీ ఎక్కువ కావచ్చు లేదా తక్కువ కావచ్చు. కానీ సిప్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వడ్డీ స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా కావలసిన ఆదాయాన్ని పొందవచ్చు.
అందువల్ల నెలకు తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ ఆదాయాన్ని పొందాలనుకుంటే ఈ మార్గం బెటర్ అని కొందరు నిపుణులు అంటున్నారు. అయితే చాలామంది ఒకేసారి పెట్టుబడి పెట్టి పెద్ద మొత్తంలో రాబడి పొందాలని అనుకుంటారు. కానీ దానికంటే ఇలా నెలనెలకు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆదాయం పైనే ఎక్కువగా రిటర్న్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.