Today 23 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు పాత సమస్యల నుంచి బయటపడి కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. మరికొన్ని రాశుల వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాజు వారు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటే ఓపికతో వ్యవహరించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతికూలమైన వాతావరణం ఏర్పడితే సంయమనం పాటించాలి. ఊహించని ఖర్చులు ఉండే అవకాశం ఉంది. కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. రెట్టింపైన ఉత్సాహంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చకుండా ఉండాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగులకు ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు ప్రత్యర్థుల నుంచి బెడద ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి ప్రవర్తన వల్ల మానసికంగా ఆందోళన చెందుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు అనుకోని అదృష్టాన్ని పొందుతారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులు నైపుణ్యం ప్రదర్శించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే మంచి సమయం.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణ ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. స్నేహితుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈరోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కమ్యూనికేషన్స్ రంగంలో ఉన్నవారికి కలిసివస్తుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. అనవసరపు వాగ్దానాలు చేయకుండా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇదే మంచి సమయం. ఉద్యోగులకు అదృష్టం కలిసి వస్తుంది. దీంతో ముఖ్యమైన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. దీంతో ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్తపల్లి ప్రారంభించడానికి ఇదే మంచి సమయం.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. కొత్త వస్తువుల కొనుగోలులో వాయిదా వేసుకోవాలి. మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో గడపాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. శ్రేయోభిలాషుల నుంచి ధన సహాయముంటుంది. కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీర్ఘకాలిక కోరికలు నెరవేరే అవకాశముంది. విహారయాత్రలకు వెళ్లి ఎందుకు ప్లాన్ చేస్తారు. అనుకోకుండా ధన లాభం ఉండే అవకాశం ఉంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు అదనపు బాధ్యతలను చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నతాధికారుల అండదండలతో ఉద్యోగులు అధిక లాభాలు పొందుతారు. కార్యాలయాల్లో ఉద్యోగుల పనితీరుకు ప్రశంసలు అందుతాయి. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. దీంతో వీరి వ్యాపార అభివృద్ధి అధికంగా ఉండే అవకాశం ఉంది.