Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: రూటు మార్చిన చంద్రబాబు.. ఏంటి సార్ ఈ వాయింపులు

Chandrababu: రూటు మార్చిన చంద్రబాబు.. ఏంటి సార్ ఈ వాయింపులు

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు పాలనా దక్షుడు అని పేరు దక్కించుకున్నారు. గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనే పేరు ఆయనకు ఉంది. అధికార యంత్రాంగం విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా పాలనను గాడిన పెట్టడంలో ముందుంటారు. తాజాగా ఆయన ఈరోజు చ ఏకంగా ప్రజల ముందు రివ్యూ జరిపారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. బాపట్ల జిల్లా కొత్తపేటలో సీఎం చంద్రబాబు పర్యటించారు. నేతన్న సేవలో పథకం ప్రారంభించి చేనేత కుటుంబానికి 25 వేల చొప్పున సాయం […]

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు పాలనా దక్షుడు అని పేరు దక్కించుకున్నారు. గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనే పేరు ఆయనకు ఉంది. అధికార యంత్రాంగం విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా పాలనను గాడిన పెట్టడంలో ముందుంటారు. తాజాగా ఆయన ఈరోజు చ ఏకంగా ప్రజల ముందు రివ్యూ జరిపారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. బాపట్ల జిల్లా కొత్తపేటలో సీఎం చంద్రబాబు పర్యటించారు. నేతన్న సేవలో పథకం ప్రారంభించి చేనేత కుటుంబానికి 25 వేల చొప్పున సాయం అందించారు. అయితే ప్రజల సమక్షంలోనే చంద్రబాబు రివ్యూ జరపడం విశేషం. అనంతరం చీరాలలో సైతం చంద్రబాబు పర్యటించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల ఎదుటే శాఖల వారిగా రివ్యూలు జరిపారు. అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.

* ప్రారంభంలోనే కీలక ప్రకటన..
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. అధికారుల తో పాటు యంత్రాంగం తీరులో మార్పు రావాలని.. లేకుంటే 1995 నాటి చంద్రబాబును చూస్తారని హెచ్చరించారు. 1995లో తొలిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు చంద్రబాబు. అప్పట్లో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించేవారు. పాలనకు సంబంధించి కార్యక్రమాలను నిర్వహించేవారు. నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి పాలన సాగించేవారు. మరోసారి అటువంటి పరిస్థితిని తీసుకొచ్చేలా చేయవద్దని.. అధికారులతో పాటు యంత్రాంగం బాధ్యతగా వ్యవహరించాలని కోరారు చంద్రబాబు చాలా సందర్భాల్లో. అయినా సరే కొందరి వైఖరిలో మార్పు రాకపోవడంతో ఇప్పుడు నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది.

* శాఖల ప్రగతిని తెలుసుకుంటూ..
చీరాలలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాకు సంబంధించి శాఖల వారీగా సమీక్ష జరిపారు ప్రజల మధ్యలోనే. ఒక్కో శాఖలో వైఫల్యాలను గుర్తిస్తూ గట్టి హెచ్చరికలే జారీచేశారు. దీంతో ప్రజల్లో బలమైన చర్చ జరిగింది. చంద్రబాబు అన్నంత పని చేశారు అంటూ అధికారులు చర్చించుకోవడం కనిపించింది. ఇటీవల చంద్రబాబు కొన్ని విషయాల్లో దూకుడుగా ఉంటున్నారు. రెండేళ్ల ప్రభుత్వ పాలన పూర్తయింది. ఇలానే ముందుకు సాగితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చంద్రబాబుకు తెలుసు. అందుకే యంత్రాంగాన్ని పరుగులు పెట్టించే పని మొదలుపెట్టారు. మున్ముందు మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper