Yellow Sperm : వీర్యం పసుపు రంగులో వస్తుందా? కారణం ఇదే..
వీర్యం తెల్లటి చిక్కటి జెల్ లాగా ఉంటుంది. ఇది పురుష జననేంద్రియాల నుంచి విడుదల అవుతుంది. అయితే ఒక్కోసారి ఇది రంగు మారొచ్చు. కానీ
Written By:
Chai Muchhata , Updated On : January 30, 2024 4:03 pm
Yellow sperm
Follow us on
Yellow Sperm :సంతానోత్పత్తికి వీర్యం ప్రధానం. ఇది పురుషుల్లో అధికంగా ఉంటుంది. పురుషుల్లో వీర్య కణాలు ఆరోగ్యంగా ఉండి, అవి అండాన్ని తాకడం వల్ల సంతానం ఏర్పడుతుంది. వీర్యం తెల్లటి చిక్కటి జెల్ లాగా ఉంటుంది. ఇది పురుష జననేంద్రియాల నుంచి విడుదల అవుతుంది. అయితే ఒక్కోసారి ఇది రంగు మారొచ్చు. కానీ వీర్యం రంగు మారుతుందంటే ఆ పురుషుడు అనారోగ్యంతో ఉన్నాడని అర్థం. పచ్చ కామెర్లు ఉన్న వారిలో వీర్యం పసుపు రంగులో మారుతుంది. అయితే ఇలా వీర్యం పసుపు రంగులో మారడానికి కారణం ఏంటి?
పురుషుల్లో తెల్ల రక్త కణాలు పెరగడం వల్ల వీర్యం రంగు మారే అవకాశాలు ఉన్నాయని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. అలాగే లైంగికంగా సంక్రమించే వ్యాధుల తోనూ ఎల్లో స్పెర్మ్ వస్తాయంటున్నారు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లయితే అతని వీర్యం తెల్లగానే ఉంటుంది. అదే అతడు లైంగిక వ్యాధి లేదా వాటికి సంబంధించిన అరోగ్య సమస్యలతో బాధపడుతున్నా.. వీర్యం పసుపు రంగులోకి మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వీర్యం రంగు మారడానికి కేవలం ఆరోగ్య సమస్యలే కాకుండా తినే ఆహారం పై కూడా ఉంటుంది. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడంతో పాటు వేయించిన ఆహారం తినడం వల్ల రంగు మారే ప్రమాదం ఉంది.
అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని ప్రోటీన్లు లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. వీటిలో వెల్లల్లి ఒకటి. ఇందులో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎంజైమ్మస్ స్పెర్మ్ బొటిలిటీని పెంచడంలో సాయపడుతుంది. రక్త ప్రసరణ సాఫీగా ఉండి వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. వీర్య కణాల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.