STSS Japan: ప్రపంచాన్ని మరో బ్యాక్టిరియా భయపెడుతోంది. జపాన్‌లో వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ ఏకంగా మనిషి మాంసాన్నే తినేస్తుంది. ఈ ప్రాంతాణక బ్యాక్టిరియా బారిన పడిన రెండు రోజులకే మనిషి చనిపోతాడని జపాన్ వైద్యులు చెబుతున్నారు. జపాన్‌లో కరోనా ఆంక్షలు సడలించిన తర్వాత ఈ బ్యాక్టిరియా వేగంగా వ్యప్తి చెందుతోంది. వైద్యుల అంచనా ప్రకారం .. ఈ బ్యాక్టిరియా మనిషిని 48 గంటల్లో చంపేస్తుంది. ఈ బ్యాక్టిరియా వలన వచ్చే వ్యాధిని స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్(ఎస్‌టీఎస్‌ఎస్)అని పిలుస్తారు.
వేగంగా వ్యాప్తి…
జపాన్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తెలిపిన వివరాల ప్రకారం 2024, జూన్ 2 నాటికి ఈ శ్యాధి కేసులు 977 కి చేరాయి. గతేడాది 941 కేసులు నమోదయ్యాయి. ఈ ఇనిస్టిట్యూట్ 1999 నుంచి ఈ వ్యాధికి సంబంధించిన రికార్డులను భద్రపరుస్తోంది.
వ్యాధి లక్షణాలు ఇవీ..
ఈ వ్యాధి సోకినప్పుడు గొంతు నొప్పి మొదలవుతుంది. అలాగే శరీరంలోని వివిధ అవయవాల్లో వాపు, నొప్పి, జ్వరం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఇది శ్వాస సమస్యలు, అవయవ వైఫల్యానికి దారితీసి చివరికి బాధితుడి మృత్యు ఒడికి చేరుస్తాయి. 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని పలు పరిశోధనల్లో తేలింది. జపాన్‌లో ఈ కేసుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి 2,500లకు పెరుగుతందని అంచనా వేస్తున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: A rare flesh eating bacteria that can kill in 2 days has spread in japan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com