Traffic Control: తెలంగాణ రాజధాని, విశ్వనగరం హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య వాహనదాలు నరకం అనుభవిస్తున్నారు. ఇక వర్ష పడితే కిలోమీటర్ ప్రయాణానికి కూడా గంట సమయం పడుతుంది. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్య పరిష్కాఆనికి సైబరాబాద్ పోలీసులు కొత్త విధానం అమలు చేస్తున్నారు. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు గతంలోనూ అనేక ప్రయత్నాలు చేశారు. దీంతో కొంత వరకు ట్రాఫిక్ తగ్గినా పూర్తిగా పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంంలో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు.
ఏరియల్ సర్వే లైన్స్ ద్వా..
ట్రాఫిక్ నియంత్రణకు ఏరియల్ సర్వేలైన్స్ ద్వారా ట్రాఫిక్ పరిష్కరించనున్నారు. ఇందుకు అత్యాధునిక సాంకేతిక ఉన్న అడ్వాన్స్‌డ్ డ్రోన్ కెమెరాలను ఉపయోగించాలని నిర్ణయించారు. 100 మీటర్ల రేడియస్‌లో నుంచి డ్రోన్ కెమెరాను ఎగురవేసి ట్రాఫిక్ జంక్షన్ దగ్గర పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడాయేని అంటున్నారు.
రద్దీ ప్రాంతాల్లోనే..
హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో అత్యంత రద్దీగాఉండే ప్రాంతం సైబరాబాద్ ఐటీ కారిడార్. ప్రతీరోజు ఇక్కడ ట్రాఫిక్ సమస్య సర్వసాధారణం. వర్షం కురిస్తే సమస్య మరింత పెరుగుతుంది. వేలాది మంది పాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే సైబరాబాద్ పోలీసులు ఈ కొత్త డ్రోన్ టెక్నాలజీని వినియోగించనున్నారు. రద్దీగా ఉండే జంక్షన్లను టార్గెట్ చేసుకొని 100 మీటర్స్ రేడియస్ పరిధిలో ఈ డ్రోన్ కెమెరాను ఎగరవేసి ఇది చూపించే విజువల్స్ ఆధారంగా త్వరితగతిన సమస్య పరిష్కరిస్తారు.
ట్రాఫిక్‌తోపాటు రోడ్డు ప్రమాదాల నియంత్రణ..
డ్రోన్ టెక్నాలజీతో ట్రాఫిక్ సమస్యతోపాటు రోడ్డు ప్రమాదాల నివారణకు కూడా దోహదపడుతుందని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగి వెంటనే ఘటన స్థలానికి త్వరితగతిన పోలీసులు చేరుకునేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పోలీసులు వీక్షిస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత పోలీసులను పంపించి ట్రాఫిక్ క్లియర్ చేయడంతోపాటు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తారు. ఇక రోడ్లపై ట్రాఫిక్ సమస్య ప్రారంభం కాగానే సమీపంలోని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించి క్లియర్ చేస్తారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: A new experiment in traffic control
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com