Homeఅంతర్జాతీయంManhole cover theft Pakistan: ఛీ ఛీ..పాకిస్తాన్ లో చివరికి మ్యాన్ హోల్ మూతలను కూడా...

Manhole cover theft Pakistan: ఛీ ఛీ..పాకిస్తాన్ లో చివరికి మ్యాన్ హోల్ మూతలను కూడా వదలడం లేదు..

Manhole cover theft Pakistan: పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితి రోజురోజుకు పతనమవుతోంది. ఇతర దేశాలు అప్పులు ఇస్తే తప్ప పాకిస్తాన్ రోజువారీ వ్యవహారాలు ముందుకు సాగడం లేదు. విదేశీ మారకద్రవ్యం రోజురోజుకు తగ్గిపోతుంది. కంపెనీలు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నాయి. అభివృద్ధి లేదు. ఉపాధి కల్పించే అవకాశం లేదు. అక్షరాస్యత అంతంత మాత్రం.. పాలకులకు సొంత ఆస్తులను పెంచుకోవడం.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడంతోనే సరిపోతుంది. దీనికి తోడు ఉగ్రవాదుల కార్యకలాపాలు.. పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలు చేస్తున్నాయి.

పాకిస్తాన్లో ఇప్పటివరకు కరువు కాటకాలు వచ్చాయి. అపారమైన వర్షాలు కూడా కురిసాయి. భూకంపాలు కూడా చోటుచేసుకున్నాయి. ఇక రాజకీయంగా అస్థిరత్వ పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇన్ని జరిగినప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రజలు ఎన్నడు దిగజారి బతకలేదు. కానీ కొంతకాలంగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిపోవడంతో ప్రజల జీవితం మీద తీవ్రంగా ప్రభావం పడుతోంది.

తాజాగా అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో అక్కడి ప్రజలు ఇనుప మ్యాన్ హోల్ మూతలను రాత్రికి రాత్రే ఎత్తుకుపోతున్నారు. వాటిని ఇనుప షాపులలో అమ్మేస్తున్నారు. వచ్చిన డబ్బులతో సరుకులు కొనుగోలు చేసి.. బతుకుతున్నారు. ఈ వ్యవహారం అక్కడి ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. దీంతో పంజాబ్ సీఎం మరియం నవాజ్ కీలకమైన ఆదేశాలను జారీ చేశారు. మ్యాన్ హోల్ మూతలను దొంగిలించినా.. కొనుగోలు చేసినా.. ఒకటి నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తామని.. 50 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

” అక్కడి ప్రజల బతుకు దారుణంగా మారింది. ఉపాధి లేదు. చేద్దామంటే పనిలేదు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్దామంటే చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఇలాంటప్పుడు ఎలా బతకాలి.. ఎలా జీవన సాగించాలి.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియక అక్కడి ప్రజలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ పాకిస్తాన్ పరిపాలకులు మొద్దు నిద్ర వీడిపోవడం లేదని” అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper