Homeఅంతర్జాతీయంUnknown Gunmen Pakistan: స్వచ్ఛ పాకిస్తాన్‌ అభియాన్‌.. ఉగ్రవాదులను ఏరివేస్తున్న దురంధర్‌లు!

Unknown Gunmen Pakistan: స్వచ్ఛ పాకిస్తాన్‌ అభియాన్‌.. ఉగ్రవాదులను ఏరివేస్తున్న దురంధర్‌లు!

Unknown Gunmen Pakistan: 2025, ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 22 మంది అమాయక యాత్రీకులు మరణించారు. దీంతో భారత్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తర్వాత ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టి పాకిస్తాన్‌ను చావుదెబ్బకొట్టింది. తర్వాత భారత్‌లోని ఉగ్రమూలాలు ఉన్నవారి భరతం పడుతోంది. ఇదే సమయంలో పాకిస్తాన్‌లో భారత భారత వ్యతిరేక ఉగ్రవాదులపై అనుమానాస్పద దాడులు తీవ్రంగా పెరిగాయి. గత వారాల్లో గుర్తుతెలియని వ్యక్తులు జైష్‌–ఎ–మహ్మద్, లష్కర్‌–ఎ–తౌహీద్‌ వంటి సంస్థల కీలక నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు

భారత్యతిరేక హరితంగా..
పాకిస్తాన్‌ ఉగ్రవాదుల మధ్యలో ‘స్వచ్ఛ పాకిస్తాన్‌’ అనే పేరుతో ఎవరో దురంధరులు పనిచేస్తున్నారనే చర్చ జరుగుతోంది. గత వారం 8 మంది భారత వ్యతిరేక ఉగ్రవాదుల మరణాలు ఈ అభియాన్‌కు సంబంధించినవని అనుమానం. ఈ దాడులు గుండెపోటు, రోడ్డు ప్రమాదాల వంటి సహజ కారణాలుగా చూపిస్తున్నారు, కానీ నిజం వెలుగులోకి రాలేదు.

కీలక ఉగ్రవాదుల మరణాలు..
తాజాగా ఏప్రిల్‌ 29న మౌలానా సల్మాన్‌ అజహర్‌ అనే వ్యక్తి జైష్‌ ఎ మహ్మద్‌కీలక నేత. అనేక ఉగ్రవాద వ్యూహ రచనల్లో సిద్ధహస్తుడు. 2001 పార్లమెంటు దాడి. 2019 పుల్వామా దాడి ప్లానింగ్‌ మ్యూహంలో కీలకంగా వ్యవహరించాడు. తాజాగా పైలోకానికి వెల్లాడు. ఇతను రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టి వెళ్లింది. అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదం అజ్ఞాత సాయుధులు అని చెప్పకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చెబుతున్నారు. అత్యంక్రియలు బావల్‌పూర్‌లోని మర్కత్‌ సుభానల్లా మసీదు సమీపంలో నిర్వహించారు. రెండు రోజుల క్రితం షేక్‌ యూసుఫ్‌ అఫ్రిదీని కూడా అజ్ఞాత వ్యక్తులు కాల్చి చంపేశారు. ఇతను లష్కర్‌ ఎ తోయిబా కీలక నాయకుడు. ఇక తాజాగా అబ్దుల్‌ ఖాదర్‌ సాహెబ్‌ అనే అతను తాలిబాన్లకు సహకరించాడు. తెహ్రీక్‌ ఎ తాలిబాన్‌ పాకిస్తాన్‌ను దెబ్బతీసేందుకు ఐఎస్‌కేకు పనిచేస్తున్నాడు. భారత వ్యతిరేకి. ప్రస్తుతం ఆఫ్గాన్‌ వ్యతిరేక ఆపరేషన్లలో కీలంగా ఉన్నాడు. తాజాగా అతడిని లేపేశారు. మౌలానా అబ్దుల్‌ అజీజ్‌ మసూద్‌ అజహర్‌కు సన్నిహితుడు. గతేడాది జూన్‌లో లేపేశారు. అనుమానాస్పద మృతిగా పేర్కొన్నారు.

రెండేళ్లలో వంద మందికిపైగా..
గత రెండేళ్లలో మంద మందికిపైగా భారత వ్యతిరేకులను పాకిస్తాన్‌లో అజ్ఞాత సాయుధులు లేపేశారు. ఇందులో 20 మందికి పైగా భారత మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదులు ఉన్నారు. లాహోర్, సియాల్‌కోట్, కరాచీ వంటి ప్రదేశాల్లో జరిగిన ఈ హత్యలు ఒకే ధోరణిని పాటిస్తున్నాయి. పాక్‌ భద్రతా సంస్థలు కేసులు నమోదు చేయడం, దర్యాప్తు చేయడం లేదు.

ఎవరు వెనుక ఉన్నారు?
ఉగ్రవాదుల మరణానికి మూడు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి ఉగ్రవాద గ్రూపుల మధ్య విభేదాల కారణంగా ఒక గ్రూపు వ్యక్తులను మరో గ్రూపు లేపేస్తోందని, ఇక పాకిస్తాన్‌ తమ అవసరాలు తీరిన వారిని ఖతం చేయిస్తోందని కొందరు వాదిస్తున్నారు. మూడో వాదన.. భారత్‌కు చెందిన రా ఏజెంట్లు ఈ పనిచేస్తున్నారని. వరుస దాడుల వల్ల ఉగ్రవాదులు భయంతో మారువేషాల్లో దాక్కుంటున్నారు. పాక్‌ ప్రభుత్వం మౌనంగా ఉండటం వల్ల మిస్టరీ మరింత లోతుగా మారింది .

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper