Homeజాతీయ వార్తలుKatchatheevu Island: ఆ ద్వీపం ఇచ్చిన ఇందిరను దేశద్రోహి అన్నారు.. ఈ ద్వీపం ఇచ్చిన మోదీని...

Katchatheevu Island: ఆ ద్వీపం ఇచ్చిన ఇందిరను దేశద్రోహి అన్నారు.. ఈ ద్వీపం ఇచ్చిన మోదీని దేశభక్తుడు అంటున్నారు!

Katchatheevu Island: భారత దేశం చుట్టూ కీలకమైన ద్వీవపాలు ఉన్నాయి. ఇవి భారత్‌కు ఎంతో కీలకం. అయితే ఇందులో ఒక దీవిని ఇందిరాగాంధీ 1974లోనే శ్రీలంకకు అప్పగించింది. ఇక భారత్‌కు ఎంతో కీలకమైన అండమాన్‌ దీవులను తాజాగా మోదీ ప్రభుత్వం అదానీకి అప్పగించింది. గ్రేటర్‌ నికోబార్‌ ప్రాజెక్టు పేరుతో అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అడవులు తొలగించబడుతున్నాయి. ఇదంత దేశ రక్షణకే అని కేంద్రం చెబుతోంది. దీంతో పార్యవరణానికి ఇబ్బంది అని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో […]

Katchatheevu Island: భారత దేశం చుట్టూ కీలకమైన ద్వీవపాలు ఉన్నాయి. ఇవి భారత్‌కు ఎంతో కీలకం. అయితే ఇందులో ఒక దీవిని ఇందిరాగాంధీ 1974లోనే శ్రీలంకకు అప్పగించింది. ఇక భారత్‌కు ఎంతో కీలకమైన అండమాన్‌ దీవులను తాజాగా మోదీ ప్రభుత్వం అదానీకి అప్పగించింది. గ్రేటర్‌ నికోబార్‌ ప్రాజెక్టు పేరుతో అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అడవులు తొలగించబడుతున్నాయి. ఇదంత దేశ రక్షణకే అని కేంద్రం చెబుతోంది. దీంతో పార్యవరణానికి ఇబ్బంది అని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో అండమాన్‌కు చెందినవారు సోషల్‌ మీడియాలో ఈ రెండు ద్వీపాలను పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇవి ఇప్పుడు వైరల్‌ అవుతున్నా.

కచ్చతీవు..
కచ్చతీవు 285 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ద్వీపం పాల్క్‌ జలసంధిలో ఉంది. రామేశ్వరం నుంచి 16 కి.మీ., శ్రీలంక నుంచి 13 కి.మీ. దూరంలో ఉంటుంది. అయితే ఈ ద్వీపంలో తాగునీరు లేకపోవడంతో మానవులు నివసించరు. ఓ మత్స్యకారుడు గతంలో ఓ చర్చి నిర్మించాడు. ఇక్కడ ఏడాదికోసారి వేడుకలు జరుగుతాయి. రెండు దేశాల భక్తులు పాల్గొంటారు. అయితే ఈ ద్వీపాన్ని 1974లో ఇందిరా గాంధీ–సిరిమావో భండారనాయకే ఒప్పందంతో మెరైటైమ్‌ వివాదాలు సమాధానం కోసం శ్రీలంకకు ఇచ్చారు, ఫిషింగ్‌ హక్కులు మాత్రమే భారత్‌కు అనుమతించారు. దీంతో నాడు ఇందిరాగాంధీని దేశ ద్రోహి అన్నారు.

అండమాన్‌–నికోబార్‌ వ్యూహాత్మక ఆధిపత్యం
ఇక అండమాన్‌–నికోబార్‌ ద్వీపసమూహం 8,249 చ.కి.మీ. వైశాల్యంతో భారతీయ ఉపభూఖండం నుంచి 1,600 కి.మీ. దూరంలో ఉంది. మలక్కా జలసంధికి సమీపంలో ఉండటం వల్ల హిందూ మహాసముద్రం–పసిఫిక్‌ మహాసముద్రాల మధ్య వాణిజ్య మార్గాలపై నిఘా పెట్టే అవకాశం భారత్‌కు ఉంది. గ్రేట్‌ నికోబార్‌ వంటి కీలక ద్వీపాల్లో స్థాపనలు ఏర్పాటు చేయడానికి 1970ల్లో ఇందిరా ప్రభుత్వం ఆర్మీ రిటైర్డ్‌ వ్యక్తులకు భూమి, రాయితీలు అందించింది. ఇప్పుడు అక్కడి జనాభాలో చాలామంది అలాంటి సెటిల్మెంట్లే, కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చినవారు ఆధిపత్యాన్ని బలపరిచారు.

వివాదాలు..
కచ్చత్తీవును ఇవ్వడం ’దేశద్రోహం’గా చూడబడుతుంది, అయితే అది మెరైటైమ్‌ బౌండరీల స్థిరీకరణకు భాగమే. భారత్‌కు 2,100 చ.నాటికల మైళ్లలో అధిక భాగం లభించింది. మరోవైపు అండమాన్‌లో అదానీ సంస్థ దట్ట అడవులను కూడా నరికి సెటిల్మెంట్లు ఏర్పాటు చేసి, వాణిజ్య–భద్రతా ప్రయోజనాలు పొందుతోంది. ఈ రెండూ భారత విస్తరణ వ్యూహాల ఉదాహరణలు. ఒకటి విడిచి ఇచ్చి, మరొకటి పట్టుకుని బలోపేతం చేస్తూ

కచ్చత్తీవు ఫిషరీస్‌ వివాదాలకు మధ్యస్థత, అండమాన్‌లో నేవీ బేసులు చైనా–పాక్‌ ప్రభావాన్ని అడ్డుకుంటాయి. రెండూ భారత మెరైటైమ్‌ ఆధిపత్యానికి కీలకం. అయితే ఒకటి కేటాయించడం దేశద్రోహం అయితే.. మరొకటి కేటాయింపు వివాదాస్పదం అయింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper