Homeఅంతర్జాతీయంStrait of Hormuz Closure Impact On Global Economy: ఆర్మూజ్‌ జలసంధి మూసివేత.. ప్రపంచ...

Strait of Hormuz Closure Impact On Global Economy: ఆర్మూజ్‌ జలసంధి మూసివేత.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం

Strait of Hormuz Closure Impact On Global Economy: ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం రోజు రోజుకూ తీవ్రం అవుతోంది. అందరూ ఊహించినట్లుగానే యుద్ధం ప్రారంభం అయిన వెంటనే ఇరాన్‌ ఆర్మూజ్‌ జలసంధి మూసివేసింది. ఇక యుద్ధం ప్రారంభమైన తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఇరాన్‌ గల్ఫ్‌ దేశాలపై దాడి చేపట్టింది. ఈ పరిణామాలు ఆయిల్‌ సంక్షోభానికి దారితీస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. షేర్‌ మార్కెట్లను కుంగదీస్తున్నాయి.

Also Read: అక్కినేని నాగ చైతన్య కి తృటిలో తప్పిన ప్రమాదం.. ఆందోళనకు గురి చేస్తున్న వీడియో!

స్ట్రెయిట్‌ ఆఫ్‌ హార్ముజ్‌ మూసివేత..
ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ బలగాలు మోహరించిన ఈ సంకీర్ణ జలమార్గం ప్రపంచ చమురు రవాణాలో 20% భాగస్వామి. రోజుకు 20 మిలియన్‌ బ్యారెళ్లు, సంవత్సరానికి 500 బిలియన్‌ డాలర్ల విలువైన వాణిజ్యం ఆగిపోయింది. వెడల్పు కేవలం 32 కిమీతో పరిమితమైన సంధి ఇప్పుడు ప్రమాదకర ప్రాంతంగా మారింది.

ఖతార్‌లో ఉత్పత్తి నిలిపివేత..
యుద్ధం తర్వాత ఇరాన్‌ గల్ప్‌ దేశాలపై దాడి చేసింది. మొదట ఖతార్‌ను టార్గెట్‌ చేసింది. ఆ దేశంలోని రాస్‌ లఫాన్‌ పారిశ్రామిక కేంద్రంపై ఇరాన్‌ క్షిపణి దాడి చేయడంతో ఖతార్‌ గ్యాస్, చమురు కార్ఖానాలను నిలిపివేసింది. ప్రపంచ ఎల్‌ఎన్‌జీ సరఫరాలో 20% ఈ దేశం బాధ్యత వహిస్తుంది. ఆసియా మార్కెట్‌లకు 82% ప్రభావం. దీంతో ఇంధన ధరలు ఐరోపాలో 54%, ఆసియాలో 39% «పెరిగాయి.

భారత్‌పై ప్రభావం
ఖతార్‌ నుంచి 42% ఇంధనం భారత్‌కు సరఫరా అవుతుంది. అయితే భారత్‌ 5 వారాల నిల్వలతో తాత్కాలిక ఊపిరి పీల్చుకుంటోంది. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ వంటి పొరుగు దేశాలు తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నాయి. చైనాకు కూడా భారీ నష్టం. దీర్ఘకాలంలో ఇంధన ధరలు, దిగుమతి ఖర్చులు పెరిగి ఆర్థిక ఒత్తిడి తీవ్రమవుతుంది.

ప్రపంచ ఆర్థిక పరిణామాలు
సరుకు పడవలు, ఓడలు ఆగిపోవడంతో అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతింది. స్టాక్‌ మార్కెట్లలో క్షీణత, ఎనర్జీ రంగాల్లో అస్థిరత పెరిగాయి. ఇరాన్‌ వ్యూహం ప్రపంచ దేశాలను అమెరికా వ్యతిరేక ఒత్తిడికి దోహదపడుతోంది.

ఈ సంక్షోభం ఆయిల్‌ ధరలను రెట్టింపు చేస్తూ ద్రవ్యోల్బణాన్ని రేకెత్తించవచ్చు. గల్ఫ్‌ మిత్రదేశాల ఉత్పత్తి పునరుద్ధరణకు వారాలు పట్టవచ్చు; ఇది పర్యటక, ఉత్పాదక రంగాలను ప్రభావితం చేస్తుంది. భారత్‌ వంటి దేశాలు వైవిధ్యీకరణ ప్రణాళికలను వేగవంతం చేయాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular