Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Release Impact On Small Movies: ఉస్తాద్ భగత్ సింగ్ దెబ్బకి...

Ustaad Bhagat Singh Release Impact On Small Movies: ఉస్తాద్ భగత్ సింగ్ దెబ్బకి భయపడిపోతున్న చిన్న సినిమాలు…

Ustaad Bhagat Singh Release Impact On Small Movies: ఒక సినిమాని తీయడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన సమయానికి రిలీజ్ చేయడం కూడా అంతే ముఖ్యం…చిన్న సినిమాలకు రిలీజ్ డేట్ దొరక్కపోతే మాత్రం ఆ సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆశించిన మేరకు ఆదరణ అయితే దక్కదు. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఈనెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ అనౌన్స్ చేసినప్పటికి […]

Ustaad Bhagat Singh Release Impact On Small Movies: ఒక సినిమాని తీయడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన సమయానికి రిలీజ్ చేయడం కూడా అంతే ముఖ్యం…చిన్న సినిమాలకు రిలీజ్ డేట్ దొరక్కపోతే మాత్రం ఆ సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆశించిన మేరకు ఆదరణ అయితే దక్కదు. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఈనెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ అనౌన్స్ చేసినప్పటికి ఈ సినిమా మరో వారం రోజులపాటు ముందుకు వచ్చింది. మార్చి 19వ తేదీన ఉగాది కానుకగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

Also Read: అక్కినేని నాగ చైతన్య కి తృటిలో తప్పిన ప్రమాదం.. ఆందోళనకు గురి చేస్తున్న వీడియో

ఈ సినిమా ముందుకు రావడంతో కొన్ని చిన్న సినిమాలు పోస్ట్ పోన్ చేసుకున్నారు. కోన వెంకట్ ప్రొడ్యూసర్ గా వస్తున్న ‘బ్యాండ్ మేళం’ సినిమాని మొదట ఈనెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేశారు. కానీ వారం రోజులకే ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. ఆ వారం మొత్తం ఉస్తాద్ హవా నే నడుస్తుందనే ఉద్దేశంతో వాళ్లు ఈ సినిమాని మరో 10 రోజుల పాటు పోస్ట్ పోన్ చేశారు.

మార్చి 26వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం అంటూ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు… ఇక ఉస్తాద్ బాత్ సింగ్ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి. వాటిని తట్టుకొని నిలబడాలంటే మాత్రం ఈ మూవీ ప్రేక్షకుడి ఊహకు మించి ఉండాలి.

మూవీ పవన్ కళ్యాణ్ అభిమానులకు పునకలు తెస్తుంది అంటూ మేకర్స్ అయితే అంచనాలు పెంచేస్తున్నారు. ఓజీ మూవీని మించి ఈ సినిమా ఆడబోతుంది అంటూ కొంతమంది చెబుతుంటే, మరి కొంతమంది మాత్రం సినిమా కంటెంట్ ఏంటో తెలిస్తే దాన్నిబట్టి సినిమా ఎలా ఉండబోతుంది అనేది మనం ఒక అంచనాకి రావొచ్చు అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper