Samsung Apple: ఫోల్డబుల్ ఫోన్ ను ఆపిల్ మార్కెట్ లోకి తీసుకువచ్చింది. దీంతో గ్లోబల్ వ్యాప్తంగా విపరీతంగా చర్చ జరుగుతోంది. అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోయినప్పటికీ చాలామంది ఆపిల్ మార్కెట్ లోకి తీసుకువచ్చిన ఫోల్డబుల్ ఫోన్ కొనుగోలు చేస్తున్నారు.
ఫోల్డబుల్ ఫోన్ అంటే చాలామందికి ముందుగా శాంసంగ్ కంపెనీ గుర్తుకు వస్తుంది. గెలాక్సీ సిరీస్లో 2019లోనే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అప్పటినుంచి వరుసగా కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. గూగుల్.. హువావే వంట కంపెనీలు కూడా ఈ తరహా ఫోన్ లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ప్రపంచంలో ప్రీమియం ఫోన్లో తయారీలో ఆపిల్ నెంబర్ వన్ గా ఉన్నప్పటికీ ఫోల్డబుల్ ఫోన్ లను మార్కెట్ లోకి తీసుకురావడంలో కాస్త ఆలస్యం చేసింది ఇప్పుడు ఐఫోన్ డ్యూయో పేరుతో ఫోల్డబుల్ ఫోన్ లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వాస్తవానికి ఆపిల్ ఈ స్టార్ట్ అది ఫాలో కావడం కొత్త కాదు. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వెంటనే మార్కెట్లోకి దిగదు. టెక్నాలజీ మీద పట్టు సాధించిన తర్వాత అది మార్కెట్లోకి వస్తుంది. ఫోల్డబుల్ ఫోన్ల విషయంలో ఆపిల్ కూడా ఇలానే చేసింది. అయితే వీటికి కారణాలు చాలా ఉన్నాయి. ప్రారంభం మోడల్స్ లో స్క్రీన్ మధ్య మడత కల్పించడం..డిస్ ప్లే దెబ్బతినడం.. బ్యాటరీ సరిగా లేకపోవడం.. భారీగా ఉన్న ధరల మీద అనేక రకాలుగా ఫిర్యాదులు వచ్చాయి.
ప్రస్తుతం ఐ ఫోన్ డ్యూయో ను ఒకసారి పరిశీలిస్తే 7.6 అనుకూలాల స్క్రీన్ ఉంది. బయట 5.4 అంగుళాల డిస్ ప్లే రూపొందించారు. ఒకేసారి రెండు యాప్స్ వాడొచ్చు. ఏ ట్వంటీ ప్రో చిప్.. ఆపిల్ పెన్సిల్ సపోర్ట్ దీనికి ఉంది. 2 టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ధర మాత్రం ఒక రేంజ్ లో ఉంది. గూగుల్.. శాంసంగ్ ఫోన్లతో పరిశీలించి చూస్తే దీని ధర చాలా ఎక్కువ. అక్టోబర్ 16 నుంచి ప్రీ ఆర్డర్లు తీసుకుంటున్నారు. అక్టోబర్ 23 నుంచి అమ్మకాలు మొదలు పెట్టబోతున్నారు.
వ్యాపార వర్గాల ప్రకారం ప్రపంచ స్మార్ట్ఫోన్ మార్కెట్ వాటాలో ఫోల్డబుల్ ఫోన్ ల వాటా ఇప్పటికి సింగిల్ డిజిట్ లోనే ఉంది. ప్రస్తుతం ఈ విభాగంలో శాంసంగ్ వాటాతో కొనసాగుతోంది. హువావే కు 30% వాటా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది దాదాపు ఈ వేరియంట్ లో ఫోన్ల అమ్మకాలు దాదాపు 30% వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికాలం అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్లను రూపొందించినట్టు తెలుస్తోంది.