Homeఅంతర్జాతీయంRussian oil supply issue: రష్యన్ ఆయిల్ కు బ్రేక్.. మళ్లీ పెట్రో మంట!

Russian oil supply issue: రష్యన్ ఆయిల్ కు బ్రేక్.. మళ్లీ పెట్రో మంట!

Russian oil supply issue: రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే ముడిచమురుకు అమెరికా ఇచ్చిన మినహాయింపు ఆదివారం ముగిసింది. మరోవైపి ఇరాన్ – అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. హార్ముజ్ లో ప్రమాదకర పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. రష్యన్ ఆయిల్ గత కాలంలో భారత ఇంధన అవసరాలకు తగినంత సరఫరా అందించింది. ఇప్పుడు దిగుమతి ఆగిపోవడంతో జాతీయ ఇంధన మార్కెట్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది.

పునరుద్ధరించకపోతే..
రష్యన్ ఆయిల్ దిగుమతి పునరుద్ధరణ చేయకుంటే రాబోయే రోజుల్లో మరింత ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. మనకు రోజుకు సుమారు 2.3 మిలియన్ల బ్యారెల్ల మేర న్యూట్ సప్లయ్ లో తేడా ఏర్పడే అవకాశముంది. విదేశీ మార్కెట్లలో ప్రత్యామ్నాయ సరఫరా సంపాదించడం తక్షణంలో సులభం కాదు.

పెరుగుతున్న క్రూడ్ ధరలు..
అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న స్థితిలో చమురు ధరలు పెరిగాయి. యూఏఈ లోని అను విద్యుత్ కేంద్రంపై డ్రైన్ దాడి జరగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మరోవైపు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చాడు. కొత్తగా ఐదు షరతులను ప్రతిపాదించాడు. ఈ షరతులను ఇరాన్ తిరస్కరించింది. నేనే పద్యంలో చమరుదరులు మరింత పెరుగుతాయన్న సంకేతాలు వస్తున్నాయి.

భారత్ పై ప్రభావం..
రష్యా ఆయిల్ దిగు మరి నిలిచిపోవడం, హర్ముజ్ దిగ్బంధం కొనసాగుతుండడంతో సమర్ధరణం మళ్లీ పెరిగే అవకాశం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే చమరుద్ధరణ కేంద్రం పెంచింది. కమర్షియల్ గ్యాస్ ధర కూడా పెరిగింది. త్వరలో గృహవినియోగ గ్యాస్ ధరను కూడా పెంచే అవకాశం ఉంది. ఈ నెలాఖరు వరకు మళ్లీ ఆయిల్ ధరలను పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా లేదా లేటిన్‍ అమెరికా మార్కెట్లతో తాత్కాలిక ఒప్పందాలు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతర్గత రిఫైనింగ్ సామర్థ్యాన్ని పెంచడం, నౌకల మార్గాల భద్రతపై ఎక్కువ పెట్టుబడులు పెట్టడం దీర్ఘకాలిక పరిష్కారంగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు.

రష్యన్ మినహాయింపుల ముగింపుతో భారత ఇంధన సరఫరాలో తాత్కాలిక ఆందోళన కలగవచ్చు. వెంటనే ప్రత్యామ్నాయ సరఫరా సమాదానం లేదా స్ట్రాటజిక్ నిల్వలు ఉపయోగించకపోతే, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల జరగే అవకాశం ఎక్కువ. దీర్ఘకాలికంగా, దేశం సరఫరా భాగస్వామ్యాల వైవిధ్యాన్ని పెంచటం, రిఫైనింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచటం, సముద్ర మార్గ భద్రతపై పెట్టుబడులు పెంచటం అత్యవసర చర్యలుగా కనిపిస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular