Homeజాతీయ వార్తలుIndependence Day 2026: ఎర్రకోటలో వేలమంది ‘వందేమాతరం’ అంటే దద్దరిల్లిపోదా.. ఈ గూస్ బాంబ్స్...

Independence Day 2026: ఎర్రకోటలో వేలమంది ‘వందేమాతరం’ అంటే దద్దరిల్లిపోదా.. ఈ గూస్ బాంబ్స్ వీడియో చూడాల్సిందే..

Independence Day 2026: ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట మీద దేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఎగరవేస్తారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరవుతుంటారు. స్వాతంత్ర వేడుకలను ఎర్రకోటలో అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి నిర్వహించిన 80వ స్వాతంత్ర వేడుకలకు ఒక ఘనమైన నేపథ్యం ఉంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా […]

Independence Day 2026: ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట మీద దేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఎగరవేస్తారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరవుతుంటారు. స్వాతంత్ర వేడుకలను ఎర్రకోటలో అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.

ఈసారి నిర్వహించిన 80వ స్వాతంత్ర వేడుకలకు ఒక ఘనమైన నేపథ్యం ఉంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈసారి ఎర్రకోట వందేమాతరం గీతంతో మారుమోగిపోయింది. జాతీయ జెండా ఆవిష్కరణకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్థులు.. జనరేషన్ జెడ్ యువకులు.. ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వందేమాతరం గీతాన్ని గుండెల నిండుగా ఆలపించారు. వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్రం తొలిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆధ్యంతం ఆకట్టుకునే విధంగా.. తరతరాలు గుర్తుంచుకునే విధంగా వందేమాతరం గీతాన్ని ఆలపించే కార్యక్రమాన్ని చేపట్టింది.

ఇటీవల నీట్ ఉద్యమం జరిగిన నేపథ్యంలో.. ఈసారి జరిగిన స్వాతంత్ర వేడుకల్లో జనరేషన్ జెడ్ యువకులకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. స్వాతంత్ర వేడుకలలో వారితో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కనిపించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వందేమాతరం గేయాన్ని ఆయన వచ్చిన వారందరితో కలిసి ఆలపించారు. త్యాగదనుల పోరాటం వల్లే దేశం స్వాతంత్రం సాధించిందని.. వారి త్యాగం వల్లే దేశం ఈరోజు ఈ స్థాయిలో ఉందని నరేంద్ర మోడీ కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఈ దేశం స్మరించుకుంటుందని.. వారి స్ఫూర్తితో అన్ని రంగాలలో ముందడుగు వేస్తుందని స్పష్టం చేశారు.. దేశంలో అసమానతలకు తావు లేదని.. దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని.. అతి స్వల్ప కాలంలోనే అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవిస్తుందని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

వందేమాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా.. ఈ వేడుకలను కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించింది. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం నుంచి కసరత్తు మొదలు పెట్టింది. దేశం మొత్తం గర్వించే విధంగా వందేమాతరం గేయానికి సంబంధించిన 150 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించింది. జనరేషన్ జెడ్ కు అగ్ర తాంబూలం ఇచ్చింది. తద్వారా వారిలో నెలకొన్న నిరాశ నిస్పృహలను తగ్గించింది. తమ ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తుందని స్పష్టం చేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper