Homeఅంతర్జాతీయంMeta layoffs 16000 employees: మెటా కొంప ముంచేసింది.. 16వేల మంది ఉద్యోగులపై వేటు

Meta layoffs 16000 employees: మెటా కొంప ముంచేసింది.. 16వేల మంది ఉద్యోగులపై వేటు

Meta layoffs 16000 employees: 2025–26 ఫైనాన్షియల్‌ ఇయర్‌ ముగింపునకు వచ్చింది. 2026 ప్రారంభమై రెండు నెలలు గడిచింది. దీంతో ఐటీ కంపెనీలు మళ్లీ లే ఆఫ్‌లను తెరపైకి తెచ్చాయి. ఏఐ విస్తరణతో టెక్‌ రంగంలో ఇప్పటికే ఉద్యోగ నష్టాలు తీవ్రమవుతున్నాయి. తాజాగా మెటా కంపెనీ 16 వేల మంది సిబ్బందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది. 16 వేల మందికి లేఆఫ్‌ మెటా టాప్‌ నిర్వాహకులు సీనియర్‌ లీడర్లతో 79 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో 20% […]

Meta layoffs 16000 employees: 2025–26 ఫైనాన్షియల్‌ ఇయర్‌ ముగింపునకు వచ్చింది. 2026 ప్రారంభమై రెండు నెలలు గడిచింది. దీంతో ఐటీ కంపెనీలు మళ్లీ లే ఆఫ్‌లను తెరపైకి తెచ్చాయి. ఏఐ విస్తరణతో టెక్‌ రంగంలో ఇప్పటికే ఉద్యోగ నష్టాలు తీవ్రమవుతున్నాయి. తాజాగా మెటా కంపెనీ 16 వేల మంది సిబ్బందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది.

16 వేల మందికి లేఆఫ్‌
మెటా టాప్‌ నిర్వాహకులు సీనియర్‌ లీడర్లతో 79 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో 20% (సుమారు 16 వేలు) తొలగింపులు చర్చలు జరుగుతున్నాయి. ఏఐ అభివృద్ధికి డేటా సెంటర్లపై 2028 నాటికి 600 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.50 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ఖర్చు తగ్గించాలని మెటా లక్ష్యం. ఇది మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ’ఎఫిషియెన్సీ ఇయర్‌’ విస్తరణలా, ఏఐ ఫోకస్‌కు మలిచిన చర్య. మెటా స్పీకర్మాన్‌ దీన్ని ’స్పెక్యులేటివ్‌’గా పేర్కొన్నా, లీడర్‌షిప్‌ మీటింగ్‌లలో ప్రణాళికలు ధ్రువీకరించాయి.

గతంలోనూ తొలగింపులు..
మెటా సంస్థ ఉద్యోగులను తొలగిచడం కొత్తేమీ కాదు. 2022 చివర్లో 11 వేల మందిని, 2023లో 10 వేల మందిని తొలగించింది. 2022 తర్వాత తాజాగా అతిపెద్ద కోతగా 16 వేల మంది తొలగింపునకు ప్రణాళిక రూపొందించింది. ఇటీవల ఏఐ సూపర్‌ఇంటెలిజెన్స్‌ ల్యాబ్‌లో 600 మంది, వీఆర్‌ రియాలిటీ ల్యాబ్స్‌లో వెయ్యి మంది (10%) తొలగించారు. ఇవి కోడింగ్, కంటెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ టీమ్‌లను లక్ష్యంగా చేసుకున్నాయి. లేఆఫ్‌ ప్రకటించిన వారికి 16 వారాల వేతనం, అదనపు సర్వీస్‌ ఇయర్‌కు 2 వారాలు, ఇంటర్నల్‌ జాబ్‌ ఆప్షన్లు అందిస్తున్నారు.

ఏఐ పెట్టుబడులు..
మెటా 2025–26లో 70 నుంచి 72 బిలియన్‌ డాలర్ల క్యాపెక్స్‌ పెంచి, జెనరేటివ్‌ ఏఐ, చాట్‌బాట్‌లు, వైబ్స్‌ కంటెంట్‌ జనరేటర్‌లపై ఫోకస్‌ చేస్తోంది. సూపర్‌ఇంటెలిజెన్స్‌ ల్యాబ్‌లో ఎలైట్‌ రీసెర్చర్లు (లక్షల కోట్ల ప్యాకేజీలు) ఉంచి, ఫెయిర్, ప్రొడక్ట్‌ టీమ్‌లను తగ్గించారు. ఇది ’లీనర్, ఫాస్టర్‌’ స్ట్రక్చర్‌కు దారితీస్తుంది. బ్లూ ఓవల్‌ క్యాపిటల్‌తో 27 బిలియన్‌ డాలర్ల లోన్‌ తీసుకుని డేటా సెంటర్లు విస్తరిస్తోంది.

ఏఐ వల్ల రొటీన్‌ రోల్స్‌ (కోడింగ్, డేటా ఎంట్రీ) ఆటోమేట్‌ అవుతున్నాయి, కానీ ఏఐ ఇంజనీరింగ్, ఎథిక్స్‌ జాబ్స్‌ పెరుగుతాయి. మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్‌లో ఇలాంటి కోతలు ట్రెండ్‌గా మారాయి. ఉద్యోగులు ఏఐ స్కిల్స్‌ (ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్, మెషిన్‌ లెర్నింగ్‌) నేర్చుకోవాలి. దీర్ఘకాలంలో ఇది టెక్‌ లాభాలను పెంచి, ఇన్నోవేషన్‌ను వేగవంతం చేస్తుంది. మార్కెట్‌ మూడ్‌ డౌన్‌ అయినా, ఏఐ హైరింగ్‌ కొనసాగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper