Homeఅంతర్జాతీయంKim Jong un: ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత.. ఎందుకంటే నియంత కిమ్ నవ్వాడహో

Kim Jong un: ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత.. ఎందుకంటే నియంత కిమ్ నవ్వాడహో

Kim Jong un: ప్రపంచంలో ఏడు వింతలుంటాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. తెలియని వింతలు కూడా ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఆ వింతలన్నీ లెక్కేస్తే వాటికి మించింది ఇది. దానిని ఎనిమిదో వింత జాబితాలో కూడా చేర్చవచ్చు. అలాగని అది ఈ జగత్తులో ఉన్నది కాదు, మనుషులు రూపొందించింది అంతకన్నా కాదు.. మరి ఆ వింత ఏంటంటే.. ప్రపంచంలో ఎనిమిదో వింతగా చెప్పాల్సింది మనిషి గురించి..అతడు మరెవరో కాదు.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్. […]

Kim Jong un: ప్రపంచంలో ఏడు వింతలుంటాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. తెలియని వింతలు కూడా ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఆ వింతలన్నీ లెక్కేస్తే వాటికి మించింది ఇది. దానిని ఎనిమిదో వింత జాబితాలో కూడా చేర్చవచ్చు. అలాగని అది ఈ జగత్తులో ఉన్నది కాదు, మనుషులు రూపొందించింది అంతకన్నా కాదు.. మరి ఆ వింత ఏంటంటే..

ప్రపంచంలో ఎనిమిదో వింతగా చెప్పాల్సింది మనిషి గురించి..అతడు మరెవరో కాదు.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్. కిమ్ మాములు మనిషికాదు.. నియంత.. క్రూరుడు. వెనుకటి కాలంలో హిట్లర్ వంటి వాళ్లు ఉండేవారని..మనుషులను దారుణంగా చంపేవాడని మనం చదువుకున్నాం. కానీ, నేటి ఆధునిక కాలంలో హిట్లర్ ను మించిపోతున్నాడు కిమ్. దేశ ప్రజలకు నరకం చూపించుకుంటూ తాను స్వర్గ సుఖాలలో విహరిస్తున్నాడు.

కొరియాలో తను చెప్పిందే మాట. తను గీసిందే గీత. తన కట్టును మత్రమే దేశ ప్రజలుఅనుసరించాలి. తన ఫొటోలను ఇంట్లో పెట్టుకోవాలి. తనను మాత్రమే పూజించాలి. తనను మాత్రమే వారు ఆరాధించాలి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. తనకు నచ్చితే పక్కలోకి రావాలి. ఒకప్పుడు ఉత్తర కొరియా అనేది దేశం. కొంతకాలం నుంచి అది ఆయనకు సామ్రాజ్యం.

కిమ్ ఎప్పటికీ కోపంగానే ఉంటాడు. కనీసంనవ్వను కూడా నవ్వడు. ఎటువంటి హావాభావాలను ప్రదర్శించడు. కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఇదే వరస. ఆ మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలిసినప్పుడు కూడా కిమ్ నవ్వలేదు. అయితే ఇన్నాళ్లకు కిమ్ నవ్వాడు. తాను కూడా మనిషేనని, తనకు కూడా నవ్వు అనేదిఒకటి ఉంటుందని..తాను కూడా నవ్వగలనని..నవ్వితే అందంగా ఉంటానని అనుకున్నాడేమో.. అందుకే నవ్వడం మొదలు పెట్టాడు.

ఇటీవల ప్రతిష్టాత్మక ఏఎఫ్ సీ ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీని నాగోహ్యాంగ్ ఫుట్ బాల్ క్లబ్ చరిత్ర నెలకొల్పింది. నార్త్ కొరియా చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. దీంతో ఆ జట్టు ప్లేయర్లను కిమ్ జోంగ్ అభినందించారు. అందరికీ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కిమ్ తో షేక్ హ్యాండ్ తీసుకున్న తర్వాత ప్లేయర్లు ఆనందంతో గంతులు వేశారు. ఇంకొంతమంది భావోద్వేగతంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. సౌత్ కొరియాలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టోక్యో జట్టుపై ఉత్తర కొరియా విజయం సాధించింది.
image.png

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper