spot_img
Homeఅంతర్జాతీయంIsrael Defense System: డిఫెన్స్ లో ఇజ్రాయిల్ తోపు అనుకుంటాం.. కానీ సీన్ రివర్స్ .....

Israel Defense System: డిఫెన్స్ లో ఇజ్రాయిల్ తోపు అనుకుంటాం.. కానీ సీన్ రివర్స్ .. ఆ దెబ్బ కొడుతున్నది ఇరాన్ కాదు..

Israel Defense System: డిఫెన్స్ విభాగంలో ఇజ్రాయిల్ దేశం ప్రపంచ దేశాలకే తోపులాగా ఉంటుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. అంతటి అమెరికా కూడా ఇజ్రాయిల్ నుంచి డిఫెన్స్ టెక్నాలజీని దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. చివరికి ఐరన్ డోమ్ లాంటి వ్యవస్థను.. తమ దేశంలో కూడా అమలు చేస్తోంది అంటే ఇజ్రాయిల్ డిఫెన్స్ టెక్నాలజీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇజ్రాయిల్ అత్యాధునిక రక్షణ వ్యవస్థను కొనసాగిస్తూ ఉంటుంది. చుట్టూ శత్రు దేశాలు ఉండడంతో ఇజ్రాయిల్ కు ఆ మాత్రం డిఫెన్స్ వ్యవస్థ ఉండాలి. లేకపోతే శత్రు దేశాల నుంచి ఇబ్బందులు తప్పవు. అయితే అంతటి అత్యాధునిక రక్షణ వ్యవస్థ ఉన్న ఇజ్రాయిల్ దేశాన్ని ఇరాన్ కాకుండా.. ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ గ్రూపు సవాల్ చేస్తోంది. కొత్తతరం ఫైబర్ ఆప్టిక్ నియంత్రిత విధానంలో దాడులు చేస్తోంది.

ఇరాన్ కాకుండా ఇజ్రాయిల్ దేశంపై దాడులు చేస్తున్న ఆ గ్రూపు పేరు హిజ్బొల్లా. ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థ ఫైబర్ ఆప్టిక్ డ్రోన్ టెక్నాలజీతో ఇజ్రాయిల్ మీద దాడులు చేస్తోంది. రష్యా మీద ఉక్రెయిన్ కూడా ఇదే స్థాయిలో దాడులు చేసింది. ట్రెడిషనల్ రేడియో తరంగాలకు బదులుగా డ్రోన్ కు, ఆపరేటర్ కి మధ్య ఉండే అతి సన్నని ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా వీటిని నియంత్రించి దాడులు చేస్తోంది.

ఈ డ్రోన్లు రేడియో సంకేతాలను ఉపయోగించవు. అందువల్లే ఇజ్రాయిల్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ వ్యవస్థలు వీటిని జామ్ చేయలేకపోతున్నాయి. అంతేకాదు చిన్నగా ఉండే ఈ డ్రోన్లు రాడార్ల పరిధిలోకి అసలు రావు. అందువల్లే ఇజ్రాయిల్ వ్యవస్థకు వీటిని అడ్డుకోవడం ఇబ్బందికరంగా మారింది. సౌత్ లెబనాన్, ఆ సరిహద్దుల సమీపం లో హిజ్బోల్లా ఈ తరహా డ్రోన్లను అధికంగా ఉపయోగిస్తోంది.. ఈ టెక్నాలజీని ఉక్రెయిన్ అధికంగా వాడుతోంది. దీని ద్వారా పేలుడు పదార్థాలను మోసుకెళ్లి.. స్థానికంగా ఉన్న డ్రోన్లతో హిజ్బోల్లా ఇజ్రాయిల్ మీద భీకరంగా దాడులు చేస్తోందని.. యుద్ధ రంగ నిపుణులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper