Sonia Gandhi On Israel-Iran Conflict : గల్ఫ్ యుద్ధం గురించి సోనియా, మల్లికార్జున ఖర్గేలు కొన్ని వ్యాఖ్యలు చేశారు. విదేశాంగ విధానం గురించి ఎలా పడితే అలా మాట్లాడడం కుదురుతుందా? భారత్ ఇరాన్ కు మద్దతు ఇవ్వడం నైతిక బాధ్యత అని పేర్కొన్నారు.
విదేశాంగ విధానం అనేది పార్టీల ప్రయోజనాలను బట్టి ఉండదు. నైతికత, భావోద్వేగాల ప్రకారం ఉండదు. దీనికి చాలా నైపుణ్యం కావాలి. దీని అంతిమలక్ష్యం దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి.
సోనియాగాంధీ నైతిక బాధ్యత అంటూ ప్రకటించడం వివాదమైంది. ప్రతీ సందర్భంలోనూ పాకిస్తాన్ కు ఇరాన్ మద్దతు ఇస్తుంటుంది. కశ్మీర్ విషయంలో పాక్ కే మద్దతుగా ఇరాన్ మాట్లాడుతుంది. పాలస్తీనా విషయంలో సోనియా, కాంగ్రెస్ నేతలు భారత్ మద్దతు ఇచ్చిందని.. ఇప్పుడు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. పాలస్తీనాకు మోడీ వెళ్లారు. అక్కడ మద్దతు ఇచ్చారు. మహ్మద్ అబ్బాస్ తో మోడీ మాట్లాడాడు.
హమాస్ వంటి తీవ్రవాదాన్ని భారత్ సమర్థించడం లేదు. ఇజ్రాయెల్ మీద హమాస్ దాడిని తీవ్రంగా ఖండించింది భారత్. గాజాకు ఆహారధాన్యాలు, మందులను, 5 మిలియన్ డాలర్లను భారత్ అందజేసింది.
ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికాల దాడి అంశంపై భారత్ వైఖరి కరెక్టేనా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.