Homeఅంతర్జాతీయంIran Water War Against Gulf Countries: గర్ల్స్ దేశాలపై నీటి యుద్ధం ప్రకటించిన ఇరాన్

Iran Water War Against Gulf Countries: గర్ల్స్ దేశాలపై నీటి యుద్ధం ప్రకటించిన ఇరాన్

Iran Water War Against Gulf Countries: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం తీవ్రంగా కొనసాగుతుంది. నాలుగైదు రోజుల్లో ముగుస్తుందనుకున్న అంచనా తప్పింది. వారం దాటినా తీవ్రంగా కొనసాగుతోంది. దీంతో ఇప్పటికే చమురు ధరలు రెట్టింపు అయ్యాయి. మరోవైపు ఇరాన్‌ ప్రతీకార దాడులతో గల్ప్‌ దేశాలపై విరుచుకుపడుతోంది. దీంతో యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియాలోని ఆయిల్‌ ప్లాంట్లపై దాడులు చేసింది. దీంతో చమురు ఉత్పత్తికి విఘాతం కలిగింది. మరోవైపు ఆర్మూజ్‌ సలసంధి మూసివేతతో ఆయిల్‌ సరఫరా ఆగిపోయింది. దీంతో […]

Iran Water War Against Gulf Countries: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం తీవ్రంగా కొనసాగుతుంది. నాలుగైదు రోజుల్లో ముగుస్తుందనుకున్న అంచనా తప్పింది. వారం దాటినా తీవ్రంగా కొనసాగుతోంది. దీంతో ఇప్పటికే చమురు ధరలు రెట్టింపు అయ్యాయి. మరోవైపు ఇరాన్‌ ప్రతీకార దాడులతో గల్ప్‌ దేశాలపై విరుచుకుపడుతోంది. దీంతో యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియాలోని ఆయిల్‌ ప్లాంట్లపై దాడులు చేసింది. దీంతో చమురు ఉత్పత్తికి విఘాతం కలిగింది. మరోవైపు ఆర్మూజ్‌ సలసంధి మూసివేతతో ఆయిల్‌ సరఫరా ఆగిపోయింది. దీంతో కువైట్‌ చమురు ఉత్పత్తి నిలిపివేసింది. ఈ తరుణంలో ఆరాన్‌ యుద్ధ వ్యూహం మార్చింది. ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్‌ దేశాల్లోని వాటర్‌ ప్లాంట్లను టార్గెట్‌ చేస్తోంది. తాజాగా బహ్రెయిన్‌లోని సిత్రా ప్రాంతంలోని కీలక డీసలినేషన్‌ ప్లాంట్‌పై షాహెద్‌–136 డ్రోన్లు ఉపయోగించి దాడి చేసింది. బహ్రెయిన్‌ సైన్యం డ్రోన్లను అడ్డుకున్నప్పటికి ఒక డ్రోన్‌ ప్లాంట్‌ను తాకడంతో నష్టం జరిగింది. అంతకుముందు ఇజ్రాయెల్‌లోని వాటర్‌ ప్లాంట్‌ను ధ్వంసం చేసింది.

Also Read: జస్ ప్రీత్ బుమ్రా టీమిండియా వజ్రాయుధం.. బంతి పడితే వికెటే!

డీసలినేషన్‌ ప్లాంట్ల ప్రాముఖ్యత…
గల్ఫ్‌ దేశాలన్నీ ఎడారి దేశాలే. ఇక్కడ తాగునీరు దొరకదు. అందుకే ప్రభుతావలు సముద్రపు నీటినే డీసలినేషన్‌ ప్లాంట్‌లో శుద్ధి చేసి ప్రజలకు సరఫరా చేస్తాయి. ప్రపంచంలోనే 50% డీసలినేటెడ్‌ నీరు గల్ఫ్‌ దేశాల్లోనే ఉన్నాయి 500కి పైగా ప్లాంట్ల ఉన్నట్లు అంచనా. కువైట్‌లో 95% తాగునీరు డీసలినేషన్‌ ద్వారానే జరుగుతుంది. రోజుకు 1.5 మిలియన్‌ లీటర్ల నీరు ఉత్పత్తి అవుతుంది. ఇక సౌదీ అరేబియాలో 70% డీసలినేషన్‌ ద్వారానే జరుగుతంది. ఇక్కడి రాస్‌ అల్‌–ఖైర్‌ ప్లాంట్‌ ప్రపంచంలోనే అతిపెద్దది. బహ్రెయిన్‌ 100% డీసలినేషన్‌పైనే ఆధారపడుతుంది. ఇక్కడ నిత్యం 80 వేల లీటర్ల నీరు అవసరం.

ప్లాంట్లపై దాడి అందుకే..
ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ దాడులు చేస్తున్నాయి. వాటిని ఎదుర్కొనే శక్తి లేకపోవడంతో ఇరాన్‌ అమెరికాకు మద్దతుగా ఉన్న గల్ప్‌ దేశాలపై దాడులు చేస్తోంది. ఇందులో ఆయిల్, వాటర్‌ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడులతో చమురు ఉత్పత్తి తగ్గింది. నీటి సరఫరా కూడా తగ్గితే ప్రజలు ఇబ్బంది పడతారు. మరమ్మతులకు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ప్రజలు దాహంతో అల్లాడుతారు. దీంతో అమెరికాపై ఒత్తిడి పెరుగుతుంది.

ఈ దాడి యుద్ధాన్ని సైనికులకు మాత్రమే పరిమితం చేయకుండా, పౌర సౌకర్యాలకు విస్తరింపజేస్తోంది. గల్ఫ్‌ దేశాలు ఇప్పుడు రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలి. ఇలాంటి టార్గెటింగ్‌ ప్రపంచవ్యాప్తంగా నీటి భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper