Homeఅంతర్జాతీయంIran USA War: ఇరాన్‌ అమెరికా యుద్ధం.. భారత్‌ నేర్చుకోవాల్సిన ఐదు పాఠాలు ఇవే!

Iran USA War: ఇరాన్‌ అమెరికా యుద్ధం.. భారత్‌ నేర్చుకోవాల్సిన ఐదు పాఠాలు ఇవే!

Iran USA War: ఇరాన్‌ అణు కార్యక్రమాలు నిర్వహిస్తోందని, శాంతియుతంగా చర్చలు జరిపినా మారడం లేదని అగ్రరాజ్యం అమెరికా యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్‌తో కలిసి యుద్ధం చేస్తోంది. తొలి రోజే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీని చంపేసింది. దీంతో ఇరాన్‌ ప్రతిదాడులు చేస్తోంది. యూఏఈ, ఖతార్, బహ్రెయిన్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌లు, రాయబార కార్యాలయాలు, ఆర్థిక మూలాలు లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌పైనా యుద్ధం కొనసాగిస్తోంది. ఒమాన్‌ మినహా ఏడు ముస్లిం దేశాలు అమెరికా అనుకూలంగా ఉండటంతో యుద్ధం సుదీర్ఘంగా సాగే అవకాశం కనిపిస్తోంది. ‘ఖమేనీ హత్య పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, శత్రువులు ఏడ్వాల్సిందే‘ అని ఇరాన్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ’ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌–4’ పేరుతో పశ్చిమాసియాలో 27 అమెరికా స్థావరాలపై, యూఏఈలో జబేల్‌ అలీ పోర్టు, అబుదాబి విమానాశ్రయం, బుర్జ్‌ ఖలీఫాపై క్షిపణులు ప్రయోగించారు. బహ్రెయిన్, కువైట్‌లో సైరన్లు మోగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ యుద్ధం నుంచి భారత్‌ కూడా చాలా విషయాలు తెలుసుకోవాలి. అందులో ముఖ్యమైనవి ఐదు.

Also Read: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు

ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ విఫలం..
ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ నుంచి సౌదీ, యూఏఈ, ఖతార్‌ వరకు ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు ఈ యుద్ధంలో పూర్తిగా విఫలమయ్యాయి. చైనా నుంచి తెచ్చుకున్న ఇరాన్‌ సిస్టమ్‌ కూడా డ్రోన్‌లు, క్షిపణులను అడ్డుకోలేదు, హెచ్చరికలు ఇవ్వలేదు. దుబాయ్, షార్జా, బహ్రెయిన్‌లో అమెరికా బేస్‌లు ఒకేసారి దాడి ఎదుర్కొన్నాయి. భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు ఈ సాంకేతికతలపై పునరాలోచన చేయాలి.

సుదీర్ఘ యుద్ధ సామర్థ్యం..
ఇరాన్‌ ప్రజల మద్దతు, మిసైల్‌ స్టాక్‌ ఉన్నంతవరకు ఇరాన్‌ పోరాటం కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. పరాజయం అంగీకరించే సూచనలు కనిపించడం లేదు. సుదీర్ఘ యుద్ధంతో అమెరికా, ఇరాన్‌తోపాటు అమెరికా మద్దతు ఇస్తున్న ముస్లిం దేశాలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇరాన్‌ ‘యుద్ధం మీరు మొదలుపెట్టారు, మేం ముగింపు పలుకుతాం‘ అని హెచ్చరిస్తోంది.

అంతర్గత శత్రువుల ముప్పు..
ఖమేనీ సమావేశ ప్రదేశంపై మొదటి రోజు బంకర్‌ బ్లస్టర్‌ బాంబులు, మిసైళ్లు పడటానికి అంతర్గత వ్యతిరేకుల నుంచి ప్రీ–పోన్‌ సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. పాలకులపై అసంతృప్తి, రాజకీయ విభేదాలు ఇజ్రాయెల్‌కు అవకాశం కల్పించాయి. దేశీయ ఐక్యత కాపాడటం, ఇంటెలిజెన్స్‌ బలోపేతం అత్యవసరం. ఇదే సమయంలో దేశం కోసం అంతర్గత విభేదాలు లేకుండా చూసుకోవాలి.

ఆటలో అరటిపండుగా పాకిస్తాన్‌..
ఇక ఈ యుద్ధంలో న్యూక్లియర్‌ శక్తి ఉన్న పాకిస్తాన్‌ ఆటలో అరటిపండుగా మారింది. సౌదీతో డిఫెన్స్‌ అగ్రిమెంట్‌ చేసుకుంది. యూఏఈతో కూడా రక్షణ ఒప్పందాలు చేసుకుంటూ ఇజ్రాయెల్‌ పక్షాన హమాస్‌కు వ్యతిరేకంగా సిద్ధమైంది. ఏ పక్షాన అని తెలియకుండా మౌనంగా ఉంది. మరోవైపు ఎవరూ పాకిస్తాన్‌ను సాయం అంగడం లేదు. కనీసం పట్టించుకోవడం లేదు.

ముస్లిం సముదాయంలో చీలిక..
రంజాన్‌ మాసంలో జరిగిన యుద్ధం షియాలను ఇరాన్‌ పక్షాన, సున్నీలను (సౌదీ, యూఏఈ తదితరులు) అమెరికా–ఇజ్రాయెల్‌ వైపు నడిపింది. ఖమేనీ మరణానికి షియాలు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు చేశారు, సున్నీలు మౌనంగా ఉన్నారు. ముస్లిం ఐక్యతకు ఈ యుద్ధం తీవ్ర దెబ్బ తీసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper